Unusual relationship incidents: భర్త అంటే భరించేవాడు అని అర్థం. కాకపోతే ఆ భరింపునకు కూడా ఒక హద్దంటూ ఉంటుంది. ఆ హద్దు దాటిపోతే ఓపిక ఏమాత్రం ఉండదు. సహనం ఏ కోశాన కూడా కనిపించదు. ఎందుకురా బాబు ఈ దరిద్రం.. వదిలించుకుంటే మంచిది కదా అనే అభిప్రాయం కలుగుతుంది. ఇప్పుడు మన సమాజంలో మెజారిటీ భర్తల అభిప్రాయం కూడా ఇలానే ఉంది.
గత ఏడాది ఇండోర్ లో ఓ జంట పెళ్లి చేసుకుంది. హనీమూన్ వెళ్ళింది. హనీమూన్ వెళ్లిన చోట భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించేసింది. ఆ తర్వాత అనేక కట్టు కథలు అల్లింది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తర్వాత మనదేశంలో ఈ తరహా సంఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. భర్తలను చంపడం.. లేదా గాయపరచడం.. ప్రియుళ్ల సహకారంతో మట్టు పెట్టడం వంటివి ఎక్కువ అయిపోయాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ.. న్యాయస్థానాలు శిక్ష విధిస్తున్నప్పటికీ.. మార్పు రావడం లేదు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఝాన్సీ ప్రాంతంలో ఓ భర్త కు తన భార్య ప్రవర్తన పై అనుమానం వచ్చింది. వెంటనే అతడు ఆమె పై నిఘా పెట్టాడు. అతడు ఆఫీసుకు వెళ్తున్నట్టు నాటకమాడాడు. అతడు బయటికి వెళ్లగానే ఆమె అందంగా ముస్తాబయి.. బయటికి వెళ్ళేది. ఒకచోట ఆగగానే ఆమె ప్రియుడు బైక్ వేసుకుని వచ్చేవాడు. ఇద్దరూ కలిసి ఒక హోటల్ రూమ్ కి వెళ్లేవారు. అక్కడ మస్తుగా ఎంజాయ్ చేసేవారు. ఇది కనిపెట్టిన ఆమె భర్త.. పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిద్దరిని హోటల్ రూమ్లో ఉండగా పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే.. దానికి వీరిద్దరే కారణమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు, తనకు ఆ భార్య వద్దని.. ఆమె తన ప్రియుడితోనే ఉండాలని ఆ భర్త వెళ్ళిపోయాడు…
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ అనే నగరంలో దారుణం వెలుగు చూసింది. తన భార్య ఫోన్లో.. తన ఫోటోకు సిమెంట్ డ్రమ్ము అనే క్యాప్షన్ ఉంది. దాన్ని చూసిన ఆ భర్త ఆందోళనకు గురయ్యాడు. ఎందుకంటే ఆమె కొంతకాలంగా వేరే వ్యక్తితో సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఆరు నెలల వయసు ఉన్న తన పాపను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. అంతేకాదు తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసింది. చివరికి భర్త దగ్గరికి వచ్చినప్పటికీ.. ఆమె ఏ మాత్రం సంసారాన్ని కొనసాగించేది కాదు. నిత్యం ప్రియుడితో మాట్లాడుతున్న నేపథ్యంలో అ భర్త గమనించేవాడు. ఆమెను నిలదీస్తే ఆధారాలు అడిగేది. ఇటీవల ఆమె సామాజిక మాధ్యమాలను అతడు పరిశీలించాడు. తన హ*త్యకు ఆమె పన్నిన కుట్ర కోణం గుర్తించాడు. వెంటనే ఆమెను ప్రశ్నించాడు. ఈసారి ఆమె అపర కాలిక అవతారం ఎత్తింది. ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు అడిగితే నిన్ను మాత్రమే కాదు.. కుటుంబాన్ని మొత్తం అంతం చేస్తానని హెచ్చరించింది. దీంతో అతడు తట్టుకోలేక.. నువ్వు నీ ప్రియుడితోనే ఉండు అంటూ వెళ్లిపోయాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనలు మారిన సమాజ తీరుకు అద్దం పడుతున్నాయి. ఇటీవల కాలంలో భర్తల ప్రాణాలను భార్యలు తీస్తున్న నేపథ్యంలో.. చాలామంది భర్తలు మేల్కొంటున్నారు. భార్య కంటే ప్రాణాలు ముఖ్యమని.. వారిని ప్రియుళ్ళ కు అప్పగిస్తున్నారు.
