https://oktelugu.com/

Lakshadweep: ఇండియాలో పాములు, కుక్కలు కనిపించని ప్రాంతం ఉంది తెలుసా?

మనదేశంలో అత్యధిక సంఖ్యలో పాము జాతులు ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడకు దగ్గరగా ఉంటుంది లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే లక్షద్వీప్ 36 చిన్న ద్వీపాలను కలిగి ఉంది. లక్షద్వీప్ మొత్తం జనాభా 64,000. మొత్తం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లక్షద్వీప్ జనాభాలో 96% మంది ముస్లింలు.

Written By:
  • Dharma
  • , Updated On : May 5, 2024 / 12:01 PM IST

    Lakshadweep

    Follow us on

    Lakshadweep: భారతదేశంలో పాముల సంచారం సర్వసాధారణం. కుక్కలు సైతం ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ రెండు జీవులు కనిపించని ఓ ప్రాంతం మనదేశంలో ఉంది. అక్కడ మచ్చుకైనా పాములు కనిపించవు. కుక్క అరుపులు వినిపించవు. మీరు ఆశ్చర్యపడినా అది నిజం. ఇండియాలో 350 కంటే ఎక్కువ జాతుల పాములు సంచరిస్తుంటాయి. అంతేకాదు పాముల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. అయితే భారతదేశంలో ఉండే పాముల్లో కేవలం 17 శాతం మాత్రమే విషపూరితమైనవి. మిగతా వాటితో అంతగా భయం ఉండదు.

    మనదేశంలో అత్యధిక సంఖ్యలో పాము జాతులు ఉన్న రాష్ట్రం కేరళ. అక్కడకు దగ్గరగా ఉంటుంది లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండే లక్షద్వీప్ 36 చిన్న ద్వీపాలను కలిగి ఉంది. లక్షద్వీప్ మొత్తం జనాభా 64,000. మొత్తం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లక్షద్వీప్ జనాభాలో 96% మంది ముస్లింలు. నాలుగు శాతం మంది హిందువులు, బౌద్ధులు, ఇతర మతాలవారు ఉన్నారు. అయితే లక్షద్వీప్లో 36 ద్వీపాలు ఉన్నా.. వాటిలో కేవలం పది దీవులు మాత్రమే నివసించేందుకు అనుకూలం. ఇందులో కవరతి, అగతి, అమిని, కడమత్, కిలాటన్, చెట్లత్, బిత్రా, అందోహ్, కల్పాని, మినికాయ్ ద్వీపాలు ఉన్నాయి.

    అయితే కొన్ని ద్వీపాల్లో 100 కంటే తక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఈ ద్వీపాల్లో ఎక్కడ పాములు, కుక్కలు కనిపించవు. ఒకవేళ పర్యాటకులు ఎవరైనా తెచ్చినా అక్కడ యంత్రాంగం నియంత్రిస్తుంది. అయితే ఆకులు వంటి పక్షులు మాత్రం విపరీతంగా కనిపిస్తాయి. అరుదైన సీ ఆవు ఇక్కడకనిపిస్తుండడం విశేషం. లక్షద్వీప్ ముచ్చటగా ఉంటుంది. పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకే ఏటా వేసవిలో ఇక్కడికి పర్యాటకులు వేలల్లో వస్తుంటారు.