https://oktelugu.com/

Warangal: మట్టిలో పుట్టిన సీతమ్మ.. కలియుగంలో కన్నీటి కథ

రామయణంలో సీతమ్మ మట్టిలో పుట్టిందని చెబుతారు. ఈ కలియుగంలోను మట్టిలో నుంచి పుట్టింది ఈ చిన్నారి. రాక్షసులైన తల్లిదండ్రులు ఆడబిడ్డను శాపంగా భావించి మట్టిలో పాతిపెట్టారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 5, 2024 / 12:07 PM IST

    Warangal

    Follow us on

    Warangal: బతికుండగానే ఓ పసికందును పూడ్చారు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని చూస్తే ముదు రాకపోయినా.. ఆ తల్లికి చంపాలన్న కర్కశ ఆలోచన ఎలా వచ్చింది. ఆడబిడ్డను మహాలక్ష్మిలా కొలుస్తాం. కడుపులో సంతోషంగా పెరిగిన ఆ పసికందుకు పుట్టుకతోనే కష్టాలు మొదలయ్యాయి. భూమిమీద పడగానే తల్లి బొడ్డుతాడు తెంచుకోగానే మట్టిలో కలిపేయాలనుకున్నారు. పొత్తిళ్లలో నుంచి తెచ్చి ఊపిరి ఉండగానే పూడ్చివేశారు. కానీ ఆయుష్షు ఉన్న ఆ పసికందును మానవత్వం ఉన్నవాళ్లు కాపాడారు. అమ్మపాలు తాగాల్సిన చిన్నారి ఇప్పుడు ఆస్పత్రిలో ఒంటరి పోరాటం చేస్తు్తంది. అమ్మా.. నీకు భారమయ్యానా అని ఆ నవజాత శిశువు ప్రశ్నిస్తోంది. ఈ ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది.

    మట్టిలో పుట్టిన సీతమ్మ..
    రామయణంలో సీతమ్మ మట్టిలో పుట్టిందని చెబుతారు. ఈ కలియుగంలోను మట్టిలో నుంచి పుట్టింది ఈ చిన్నారి. రాక్షసులైన తల్లిదండ్రులు ఆడబిడ్డను శాపంగా భావించి మట్టిలో పాతిపెట్టారు. కొన ఊపిరితో ఉన్న ఈ పసిగుడ్డ ఓ లారీ డ్రైవర్, ఉపాధి కూలీల కంటపడింది. అంతా చలించి పునర్జన్మ ఇచ్చారు.

    లారీ డ్రైవర్‌ చూసి..
    ఉదయం 9:05 గంటలకు జాతీయ రహదారి పక్కన ఉత్తర ప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్‌ రాందినయ్‌ పసికందును చూశాడు. ఆయన కంటపడకుంటే ప్రాణాలు దక్కేవి కాదు. మట్టిలో కాళ్లు కదులుతున్న ఆనవాళ్లు చూసి వెంటనే స్పందించి మట్టి తొలగించి పాపను బయటకు తీశాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి తగిన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆ నవజాత శిశువు మృత్యుంజయురాలైంది.

    పోలీసుల విచారణ..
    ఈ ఘటనకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఊరుగొండ, ఒగ్లాపూర్‌ తదితర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వ విచాణాధికారి అశోక్‌ మాట్లాడుతూ కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. పాపను కర్కశంగా పాతిపెట్టిన నిందితులు ఎవరనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, పాప 8 నెలలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాల్లో ఆశ వర్కర్ల ద్వారా గర్భిణుల జాబితా సేకరిస్తున్నారు.