Housewarming With Toy Cow: భారతదేశంలో సాంప్రదాయాలకు పుట్టినిల్లు అని చెబుతూ ఉంటారు. ఇక్కడ పాటించే ఆచారాలు, సాంప్రదాయాలు విదేశీయులు కూడా పాటిస్తున్నారంటే భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కొందరు భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన వారు సైతం ఇక్కడి ఆచారాలను పాటిస్తున్నారు. అయితే భారతదేశంలోనే ఉంటూ కొందరు ఇక్కడి ఆచారాలు పాటించకుండా వాటిని అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కొందరు గృహప్రవేశం సందర్భంగా గోమాతను ఇంట్లోకి పంపించే కార్యక్రమంలో భాగంగా చేసిన ఓ పని కి సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ వారు గృహప్రవేశం సందర్భంగా ఏం చేశారు?
హిందూ పురాణం ప్రకారం ఏ కార్యక్రమం నిర్వహించుకున్న సాంప్రదాయంగా, ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా గృహప్రవేశం చేసే సమయంలో ఉదయం 3 నుంచి 6 గంటల లోపు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా గోమాతను ఇంట్లోకి ఆహ్వానిస్తారు. గోమాత ఇంట్లోకి వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లోకి అడుగు పెడతారు. కొత్త ఇంట్లోకి గోమాత రావడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందని.. ఎప్పటికీ ఇంట్లో ఉన్నవారు సంతోషంగా ఉంటారని భావిస్తారు. అందుకే గృహప్రవేశం చేసే సమయంలో గోమాతను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి ఇంట్లోకి ప్రవేశింప చేస్తారు.
అయితే కొందరు గోమాతను అవమానిస్తూ గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో నిజమైన గోమాతను తీసుకువచ్చే బదులు.. ఒక ప్లాస్టిక్ బొమ్మను తీసుకువచ్చి పూజా కార్యక్రమంలో ముంచారు. అంతేకాకుండా దానికి రిమోట్ కంట్రోల్ తో గోమాత ఇంట్లోకి నడిచి వచ్చే విధంగా ప్లాస్టిక్ బొమ్మను నడిపించారు. అంటే నిజమైన గోమాతకు బదులు ప్లాస్టిక్ బొమ్మ ఇంట్లోకి వచ్చినట్లుగా చేశారు. ఈ కార్యక్రమాన్ని కొందరు పూజారులే చేయడంతో మిగతావారు వారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాల కామెంట్ చేస్తున్నారు.
హిందూ పండుగల్లో ఎన్నో పటిష్టమైన ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే ఆచార్య వ్యవహారాలతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమాల్లో కొన్ని వస్తువులు అందుబాటులో లేకపోతే మిగతా వాటితో కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. కానీ ఇలా అవమానించేలా గోమాతకు బదులు ప్లాస్టిక్ బొమ్మను పెట్టడంపై చాలామంది విమర్శిస్తున్నారు. గోమాత లేకున్నా కూడా.. కార్యక్రమం నిర్వహిస్తే బాగుండేదని మరికొందరు చెబుతున్నారు. ఇలా గోమాతను ప్లాస్టిక్ బొమ్మలాగా చేయడం అవమానించడం అని అంటున్నారు.
టెక్నాలజీ యుగంలో సాంప్రదాయం కూడా టాయ్ మోడ్లో!
గృహప్రవేశం రోజున సాంప్రదాయం ప్రకారం నిజమైన ఆవు బదులుగా బొమ్మ ఆవును ఉపయోగించారు.
ఆధునిక జీవనశైలిలో సాంప్రదాయాలు, ఆచారాల పట్ల తగ్గుతున్న నిబద్ధతపై స్వామీజీలు, పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. pic.twitter.com/VJR0iYu0eX
— greatandhra (@greatandhranews) November 4, 2025