Himba Tribe Bath Once In Life: ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎండలో తిరుగుతుంటాం. వానలో తడుస్తుంటాం.. చలిలో వణికిపోతుంటాం. ఇన్ని రకాల జీవనక్రియలు జరిగినప్పుడు శరీరంలో వ్యర్ధాలు పోగుపడుతుంటాయి. పైగా మనం నీటిని తాగుతాం. ఆహారాన్ని తీసుకుంటాం. ఎండలో పనిచేస్తుంటాం. జరిగినప్పుడు శరీరంలో వ్యర్ధాలు ఏర్పడుతుంటాయి. అవి బయటికి విసర్జక వ్యవస్థ ద్వారా వెళుతుంటాయి..
సహజంగా వ్యర్ధాలలో అనేక రకాల పదార్థాలు ఉంటాయి. అందువల్ల అవి వాసన వస్తుంటాయి. మన శరీరంలో వ్యర్ధాలు బయటికి వెళ్తున్నప్పుడు చెమట వస్తుంది. ఆ చెమట విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మన శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దానికి ఉన్న ఏకైక మార్గం స్నానం చేయడం. మనలో చాలామంది స్నానం చేయకుండా ఉండలేరు. కొందరైతే ఉదయం సాయంత్రం కూడా స్నానం చేస్తూనే ఉంటారు. శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే రోగాలకు అంత దూరంగా ఉండొచ్చు. ఒకవేళ సరిగా స్నానం చేయకపోతే చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కొందరు వేడినీటిని.. ఇంకొందరు గోరు వెచ్చని నీటిని.. మరికొందరు చల్లని నీటిని ఉపయోగించి తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటారు.
ఆయా తెగలు.. వారి నివాస ప్రాంతాలను ఆధారంగా చేసుకొని స్నానాలు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఏ తెగ కూడా జీవితంలో ఒకేసారి స్నానం చేసిన దాఖలాలు లేవు. కానీ మీరు మాత్రం జీవితంలో ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. పైగా వివాహాల సమయంలోనే ఆ
స్నానాలు చేయడం విశేషం.
ఆఫ్రికా ఖండంలోని నమిబియా ప్రాంతంలో హింబా తెగకు చెందిన మహిళలు జీవితంలో ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం నీటి కొరత. అది కూడా పెళ్లి రోజున మాత్రమే వారు స్నానం చేస్తారు. మిగతా రోజుల్లో సుగంధ ద్రవ్యాలతో రూపొందించిన పొగతో దేహాన్ని శుభ్రం చేసుకుంటారు. చర్మాన్ని కాపాడుకునేందుకు వెన్న, ఎర్రటి మట్టి మిశ్రమంతో రూపొందించిన ఒట్టిజే అనే పదార్థాన్ని దేహానికి రాసుకుంటారు. అందువల్లే వారు ఎరుపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంటారు.
యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు.. తమ దేహాన్ని కాపాడుకోవడానికి ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా రుతుక్రమం వస్తున్నప్పుడు వారు అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఆ సమయంలో ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటారు.. దేహాన్ని ఎలా కాపాడుకుంటారు అనే విషయాలను బయటకు చెప్పుకోడానికి ఇష్టపడరు. అంతటి నీటి కొరత ఉన్నప్పటికీ వారు అక్కడే ఉంటారు. ఇలా ఎందుకు ఉండడం అని ప్రశ్నిస్తే.. పుట్టిన ఊరుతో మమకారం తెలుసుకోవడం అంటే.. తల్లికి దూరమైనట్టేనని చెబుతుంటారు. వీరు వేట.. వ్యవసాయం.. ఇంకా రకరకాల పనులు చేసి జీవనం సాగిస్తుంటారు. వీరంతా కూడా సమూహ జీవితాన్ని ఇష్టపడుతుంటారు. వీరిలో అక్షర జ్ఞానం ఉండదు. చదువుకోవడాన్ని మీరు ప్రతికూల భావనగా భావిస్తుంటారు. అందువల్లే వీరు దాదాపుగా అనే నిరక్ష రాస్యులుగా ఉంటారు.