Homeవింతలు-విశేషాలుViral Video: ఆవు సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్

Viral Video: ఆవు సైకిల్ తొక్కడం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్

Viral Video:  సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత కొత్త కొత్త వీడియోలు దర్శనమిస్తున్నాయి. వింత వింత వీడియోలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో sirwan maghded. Official అనే ఐడీ నుంచి ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 2.80 లక్షల మంది ఇష్టపడ్డారు..4,779 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోను చూశారు.. ఈ వీడియోను చూసి వావ్.. ఇలా కూడా జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోయారు.. ఆ వీడియోలో ఉంది ఒక ఆవు.. ఒక రేంజర్ సైకిల్.. కానీ ఈ రెండింటి కాంబినేషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.. నెటిజన్లు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తోంది. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదేం వింత అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. బాబోయ్ ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

దర్జాగా తొక్కేసింది..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చూసేందుకు ఆ ప్రాంతం ఒక విదేశం లాగా ఉంది. ఆ రోడ్డు చాలా విస్తారంగా ఉంది. పెద్దగా వాహనాల రాకపోకలు లేవు. బ్యాక్ గ్రౌండ్ లో ఒక ఇంగ్లీష్ పాట వినిపిస్తోంది. ఇదే సమయంలో సడన్ గా ఒక జెర్సీ ఆవు ఎంట్రీ ఇచ్చింది. తెలుపు, నలుపు రంగుల కలబోతతో ఆ ఆవు చూసేందుకు ఇట్టే ఆకట్టుకుంటున్నది. అలాంటి ఆవు ఒక సైకిల్ పై కూర్చుంది. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఆ వీడియోలో అలానే కనిపించింది.. కూర్చున్న ఆవు తన ఉదరభాగాన్ని సీట్ పైకి ఆనిచ్చింది. వెనక ఉన్న క్యారెల్ పై ఆ ఆవు కూర్చుంది. తన ముందరి కాళ్లను రెండు ఫెడల్స్ పై ఉంచి చాకచక్యంగా తొక్కడం మొదలుపెట్టింది. ఆ ఆవు తొక్కుతున్న తీరుకు ఆ రేంజర్ సైకిల్ వేగంగా దౌడు తీయడం మొదలుపెట్టింది. వెనక కాళ్లను కూడా ఆవు ఒడుపుగా అటూ ఇటూ పెట్టింది. ఆ సైకిల్ ను అత్యంత జాగ్రత్తగా తొక్కుతూ ముందుకు సాగింది.

సైకిల్ ఎలా తొక్కుతుంది?

ఈ వీడియోని చూసిన కొంతమంది..”ఆవు ఎలా సైకిల్ తొక్కుతుంది? దాని బరువును ఆ సైకిల్ ఆపగలదా? ఒకవేళ ఎదురుగా ఏదైనా వాహనం వస్తే ఆవు ఎలా బ్రేక్ వేస్తుంది? సైకిల్ ను ఎలా ఆపుతుంది? ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించాలంటే బెల్ ఎలా కొడుతుంది? ఇదేదో కంప్యూటర్ గ్రాఫిక్స్ లో రూపొందించిన వీడియో కావచ్చు. లేకుంటే కృత్రిమ మేధను ఉపయోగించి తీర్చి దిద్దిన వీడియో కావచ్చు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే ఈ వీడియో నిజమేనని, శిక్షణ పొందిన ఆగు ఇలా సైకిల్ తొక్కుతోందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు..

బరువు టన్ను పై మాటే..

జెర్సీ ఆవు బరువు ఎంత లేదన్నా టన్ను పైచిలుకు ఉంటుంది. అలాంటి ఆవు ఒక సైకిల్ తొక్కడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే అది సాధ్యం కాదని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ” జెర్సీ ఆవులు హైబ్రిడ్ రకానికి చెందినవి. వాటిల్లో చురుకుదనం తక్కువ. పాలు ఎక్కువగా ఇస్తాయి. మేత కూడా ఎక్కువగా తింటాయి. కాబట్టి అలాంటి జంతువులు సైకిల్ తొక్కడం అసాధ్యం. ఈ వీడియో పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించినట్టు అర్థమవుతోంది. కాకపోతే ఆ వీడియో చూసేందుకు అత్యంత సహజ సిద్ధంగా ఉంది. ఈ వీడియో రూపొందించిన వారి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే అసాధ్యాన్ని సుసాధ్యం లాగా మార్చారు.. మన కన్నులను పూర్తిగా మాయ చేశారని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version