Homeవింతలు-విశేషాలుAmityville Horror House New York: అసలే అది దయ్యాల కొంప.. కోట్లు పోసి కొనడానికి...

Amityville Horror House New York: అసలే అది దయ్యాల కొంప.. కోట్లు పోసి కొనడానికి రియల్టర్ల పోటీ

Amityville Horror House New York: ఒక ఇల్లు నిర్మించే క్రమంలో ఆ స్థలం గురించి అనేక రకాలుగా ఆరాలు తీస్తాం. వాస్తు గురించి పరిశీలిస్తాం. అనేక రకాల పరిశీలనల తర్వాత ఇల్లు నిర్మాణం మొదలు పెడతాం. ఒక ఇంటి నిర్మాణంలో ఇంతటి కసరత్తు ఉంటుంది.

ఒకవేళ ఇల్లు నిర్మించే స్థలంలో ఏవైనా ఘోరాలు జరిగినా.. దారుణాలు చోటు చేసుకున్నా.. ఆ స్థలాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడం. అటువంటిది ఓ ప్రాంతంలో ఘోరాలు జరిగాయి. హత్యలు జరిగాయి. చివరికి దారుణాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇంత జరిన తర్వాత కూడా ఆ బంగళాకు డిమాండ్ ఏర్పడింది.

ఈ దయ్యాల బంగ్లా పేరు 112 ఓషన్ అవెన్యూ. న్యూయార్క్ లోని ఐలాండ్ ప్రాంతంలో ఉంది. ఓషన్ అవెన్యూ కు దయ్యాల బంగళా అని పేరు ఉంది. ఇక్కడ ఒకప్పుడు దారుణమైన చావులు చోటు చేసుకున్నాయి. అందువల్ల ఈ ప్రాంతం పేరు చెప్తే అమెరికా ప్రజలు భయపడతారు. అయితే ఇంతటి భయంకరమైన చరిత్ర ఉన్న ఈ బంగళాను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు.. మిస్టరీలను ఇష్టపడేవారు సిద్ధంగా ఉన్నారు.

ఆ బంగళా దయ్యాల కొంపగా మారడానికి ఒక కారణం ఉంది. 1974 నవంబర్ 13న ఆ ఇంట్లో నివాసం ఉండే డెఫియో కుటుంబానికి చెందిన పెద్దకొడుకు రోనాల్డ్ డిఫియో జూనియర్ ఉన్నట్టుండి అర్ధరాత్రి పూట తన ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులను.. నలుగురు తోబుట్టువులను కాల్చి చంపాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు షాకింగ్ నిజాలు బయటపెట్టాడు.

ఇన్ని హత్యల తర్వాత ఆ భవనం ఒక్కసారిగా దయ్యాల బంగ్లాగా మారిపోయింది. అమెరికాలో కొంతమంది ఈ బంగ్లా పై పుస్తకాలు రాశారు. కొందరైతే సినిమాలు కూడా తీశారు. ఈ హత్యల వల్ల ఇంటికి విపరీతమైన ప్రచారం లభించింది. ఈ ప్రచారం వల్ల చాలామంది పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. కొంతమంది ధనవంతులు ఆ మిస్టరీ హౌస్ లో ఉండడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని భావించారు..

ఆ ఇంటిని ప్రతిరోజు చాలామంది వచ్చి ఫోటోలు తీసుకోవడం యజమానులకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆ ఇంటిని రకరకాలుగా మార్చేశారు. దయ్యం కళ్ళ మాదిరిగా కనిపించే ఆ ఇంటి అద్దాలను తొలగించారు. రంగులు మార్చేశారు. ఆధునికమైన రూపును ఇచ్చారు. ఇంటి అడ్రస్ కూడా 112 నుంచి 108 ఓషన్ అవెన్యూ అని మార్చారు.. సాదా సీదా లగ్జరీ విల్లా మాదిరిగా మార్చారు. అయితే ఆ ఇంట్లో నివసించే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అలా ఎందుకు చేశాడు? అతడికి ఏ శబ్దాలు వినిపించాయి? దాని వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version