Frigatebird lifestyle facts: పక్షులు అనగానే మనకు ఏం గుర్తుకొస్తుంది.. అవి రెక్కలను ఆడించుకుంటూ ఆకాశాన్ని దాటే తీరు మదిలో మెదులుతుంది. సునాయాసంగా తమ దేహ బరువును సమాంతరంగా ఉంచుతూ.. రెక్కలను ఆడించుకుంటూ.. కాళ్ళను సమానంగా చాపుతూ అవి ముందుకు వెళ్తుంటాయి. పక్షులు ఎగురుతున్న తీరు చూస్తే ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి స్వేచ్ఛగా విహరించడం వల్ల అమితమైన సంతృప్తిని పొందుతాయి..
పక్షులు జీవ వైవిధ్యానికి ప్రతీకలు. ప్రకృతిలో ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు వాటి జీవన శైలి ఆధారంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని పక్షులు శాకాహారులుగా ఉంటే.. మిగతా పక్షులు మాంసాహారులుగా ఉంటాయి. కాకపోతే జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో పక్షులు ప్రకృతికి పరోపకారులుగా ఉంటాయి. ముఖ్యంగా అడవుల అభివృద్ధికి.. పర్యావరణహితానికి.. పంట చేలలో చీడపీడల నాశనానికి పక్షులు సహాయం చేస్తూ ఉంటాయి.. పక్షులు వివిధ రకాలైన కాయలను, పండ్లను తింటాయి. ఆ తర్వాత వాటిని విసర్జిస్తూ ఉంటాయి. వాటి వ్యర్ధాలలో పండ్ల గింజలు బయటికి వచ్చి.. వర్షం కురిసినప్పుడు అవి మొలకలుగా మారుతాయి. ఆ తర్వాత అవి అడవులుగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి.
ప్రకృతిలో పక్షుల జీవనశైలి విభిన్నంగా ఉంటుంది. ఇందులో ఫ్రీ గెట్ పక్షుల జీవనశైలి మరింత వింతగా ఉంటుంది. ఇవి నేలమీద వాలకుండా సముద్రంపై వారాల తరబడి ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ ప్రయాణం సమయంలోనే అవి గాలిలో నిద్రిస్తూ ఉంటాయి. వీటి మెదడులో ఒక భాగం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు.. మరొక భాగం అప్రమత్తంగా ఉంటుంది. అందువల్లే అది ప్రయాణాన్ని సాఫీగా చేయగలుగుతుంది. అయితే ఈ పక్షులు కొన్ని సెకండ్ల కాలం మాత్రమే మెదడును నిద్రపుచ్చుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. వివిధ రకాల పరిశోధనలో ఈ పక్షుల గురించి ఈ విషయం తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటి మెదడులో ఉండే రెండు భాగాల వల్లే.. ఆకాశంలోనే నిద్రపోవుకుంటూ ఈ పక్షి ముందుకు సాగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ పక్షులు శాకాహారులుగా ఉంటాయి. ఒకవేళ పండ్లు లేదా కాయలు లభించినప్పుడు మాంసాహారులుగా మారిపోతుంటాయి. చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సముద్రపు ఒడ్డులో ఉన్న చిన్నచిన్న చేప పిల్లలను ఆహారంగా తీసుకుంటాయి. అందువల్లే ఈ పక్షులు చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి.
