Homeహెల్త్‌Sleeping posture health effects: రాత్రివేళ బోర్లా పడుకుంటున్నారా..

Sleeping posture health effects: రాత్రివేళ బోర్లా పడుకుంటున్నారా..

Sleeping posture health effects: ఏ మనిషికైనా సరే సరిగా నిద్ర పడితేనే ఆరోగ్యంగా ఉన్నట్టు.. అందుకే ఏదైనా అనారోగ్యం సోకినప్పుడు.. వైద్యుల వద్దకు వెళ్తే.. మీకు నిద్ర సరిగా పడుతోందా అని అడుగుతారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని మన నిద్ర నిర్ణయిస్తుందని.. ఒకపట్లగా ఇప్పుడు శారీరక శ్రమ ఉండడం లేదు. దీనికి తోడు స్మార్ట్ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రాత్రిపూట పడుకునే ముందు ఫోన్ చూడటం అందరికీ […]

Sleeping posture health effects: ఏ మనిషికైనా సరే సరిగా నిద్ర పడితేనే ఆరోగ్యంగా ఉన్నట్టు.. అందుకే ఏదైనా అనారోగ్యం సోకినప్పుడు.. వైద్యుల వద్దకు వెళ్తే.. మీకు నిద్ర సరిగా పడుతోందా అని అడుగుతారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మన ఆరోగ్యాన్ని మన నిద్ర నిర్ణయిస్తుందని..

ఒకపట్లగా ఇప్పుడు శారీరక శ్రమ ఉండడం లేదు. దీనికి తోడు స్మార్ట్ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రాత్రిపూట పడుకునే ముందు ఫోన్ చూడటం అందరికీ ఒక అలవాటు లాగా మారింది. కొందరైతే రాత్రి మొత్తం మెలకువతో ఉండి ఫోన్ చూస్తూ ఉన్నారు. ఉదయం పూట పడుకుంటున్నారు. దీనివల్ల బయోలాజికల్ క్లాక్ మొత్తం డిస్టర్బ్ అవుతోంది. కీలకమైన హార్మోన్లు విడుదల కాకపోవడంతో చాలామందికి రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

పడుకునే విషయంలో చాలామంది కంఫర్ట్ గా ఉంటుందని బోర్లా పడుకుంటారు. అయితే అలాంటి విధానంలో పడుకోవడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల వెన్నుమీద ఒత్తిడి ఏర్పడుతుందని.. మెడ ఎక్కువసేపు ఒకే వైపు ఉండటం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయని వైద్యులు అంటున్నారు. బోర్లా పడుకునేటప్పుడు ముఖం తలగడకు ఒత్తుకొని పడుకోవడం వల్ల చర్మంపై ముడతలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వెల్లకిలా లేదా ఎడమవైపు తిరిగి పడుకోవడం ఉత్తమం అని వైద్యులు అంటున్నారు.

గాడ నిద్రలో ఉన్నప్పుడు చాలామంది బోర్లా పడుకుంటారు. ఆ సమయంలో వారికి సోయి ఉండదు. అలాంటప్పుడు ఆ విధానంలో కాకుండా.. వెల్లకిల లేదా ఎడమవైపు తిరిగి పడుకుంటే బాగుంటుందని వైద్యులు అంటున్నారు. వెన్ను మీద ఒత్తిడి పెరిగినప్పుడు కచ్చితంగా రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. మెడ మీద కూడా ఒత్తిడి పెరిగి కీళ్లు, కండరాల నొప్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిద్ర సుఖవంతంగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు.

గమనిక
ఈ కథనం కేవలం పాఠకులకు అవగాహన కల్పించడానికి మాత్రమే. వివిధ వేదికల వద్ద ఈ సమాచారాన్ని సేకరించాం.. ఈ సమాచారం వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నయం కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper