Homeవింతలు-విశేషాలుViral CPR Video: ఆమెను బతికించడానికి 30 నిమిషాల పాటు సిపిఆర్..ఈ డాక్టరమ్మ చేసిన పని...

Viral CPR Video: ఆమెను బతికించడానికి 30 నిమిషాల పాటు సిపిఆర్..ఈ డాక్టరమ్మ చేసిన పని నిజంగా అద్భుతం

Viral CPR Video: శ్వాస లేదు. గుండె పనితీరు నెమ్మదిగా మందగిస్తోంది. చూస్తుండగానే ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. అప్పటికి సమయం మించిపోతోంది. పైగా ఆ రోగి చికిత్స పొందుతున్నది అత్యవసర వైద్య విభాగంలో. అలా తన పేషెంట్ క్రమక్రమంగా చావు వడిలోకి వెళ్తూ ఉండడం ఆ వైద్యురాలికి ఏమాత్రం నచ్చలేదు. పైగా ఏదైనా చేయాలి.. రోగి ప్రాణం కాపాడాలి అనుకుంది.

వైద్యో నారాయణ హరి అంటారు కదా.. ఈ పదాన్ని సార్థకం చేసింది ఆ మహిళా వైద్యురాలు. దాదాపు 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించింది. రోగి ప్రాణాలు పోతుంటే చూస్తూ తట్టుకోలేక.. సిపిఆర్ చేసింది. 30 నిమిషాల పాటు ఏకధాటిగా సిపిఆర్ చేసి.. ఆ మహిళ రోగి ప్రాణాలను కాపాడింది. ఆ మహిళకు సిపిఆర్ చేస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఆ మహిళా వైద్యురాలు చేస్తున్న ప్రయత్నం మాత్రం కన్నీరు తెప్పిస్తోంది. వైద్య వృత్తిని చాలామంది కమర్షియల్ గా మార్చేశారు. రోగం నయం కావడానికి వైద్యుల వద్దకు వెళ్తే.. జలగల మాదిరిగా పీల్చి పిప్పి చేస్తున్నారు. అటువంటి వైద్యులు ఉన్నచోట.. ఈ మహిళా వైద్యురాలు వైద్య వృత్తి అనేది కాసుల కోసం కాదని.. ప్రాణాలు కాపాడడం కోసం అని నిరూపించింది.

” ఆ రోగి చావు చివరి అంచులో ఉంటే సాటి మహిళగా ఆమె తట్టుకోలేకపోయింది. అందువల్లే ప్రాణాలకు తెగించి ఆమె ప్రాణాలను కాపాడింది. దాదాపు 30 నిమిషాల పాటు సిపిఆర్ చేసింది. ఇలా చేసి ఆ మహిళా రోగి ప్రాణాలకు భిక్ష పెట్టింది. తద్వారా మరో అమ్మగా మారి.. ఆమెకు పునర్జన్మ అందించిందని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా, ఈ సంఘటన మన దేశంలో జరిగిందని.. అది ఢిల్లీ ప్రాంతంలో అయి ఉంటుందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆ రోగి ప్రాణాలు కాపాడిన వైద్యురాలికి సెల్యూట్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version