Homeక్రైమ్‌Actress Blackmail Bangalore: వాష్ రూమ్ లో స్పై కెమెరా.. నటి వీడియోల కలకలం!

Actress Blackmail Bangalore: వాష్ రూమ్ లో స్పై కెమెరా.. నటి వీడియోల కలకలం!

Actress Blackmail Bangalore: కొందరు మగాళ్లు మృగాల కంటే దారుణంగా మారిపోయారు. మృగాలు కేవలం ఆకలి వేస్తేనే ఇతర జంతువుల మీద దాడి చేస్తాయి. కోరిక కలిగితేనే సంభోగం జరుపుతుంటాయి. కానీ, కొందరు మగాళ్లు మాత్రం మృగాల కంటే హీనంగా.. అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత స్పై కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. స్పై కెమెరాలను గూడచారులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే కొందరు ఈ స్పై కెమెరాలను దుర్మార్గమైన పనుల కోసం వాడుతున్నారు. వాటి ద్వారా రహస్య వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇటువంటి అనుభవం ఓ నటికి ఎదురైంది. దీంతో ఆమె ఏకంగా పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక నటి సీరియల్స్ లో ఎక్కువగా నటిస్తుంది. ఆమెకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమె ఆ మధ్య బెంగళూరు నగరంలో ఒక ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరైంది. ఆ సమయంలో ఆమె వాష్ రూమ్ వినియోగించుకుంది. ఆమె వాష్ రూమ్ లో ఉన్న దృశ్యాలు స్పై కెమెరా రికార్డ్ అయ్యాయి.

ఆ దృశ్యాలను ఓ వ్యక్తి ఆమెకు ఇన్ స్టా ద్వారా పంపించాడు. అనంతరం బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వకపోతే వీటిని సోషల్ మీడియాలో పెడతాను అంటూ బెదిరిస్తున్నాడు. దీంతో ఆ నటి భయభ్రాంతులకు గురైంది. అతడి వేధింపులు తట్టుకోలేక బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను ఇబ్బంది పెడుతున్న తీరును ఆమె పోలీసులకు వివరించారు.

” ఆ నటి ఫిర్యాదు మాకు అందింది. ఆమె ఇటీవల బెంగళూరులో ఒక ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాష్ రూమ్ వినియోగించుకున్నారు. ఆ దృశ్యాలను ఒక అజ్ఞాత వ్యక్తి స్పై కెమెరా ద్వారా చిత్రీకరించారు. ఆ వీడియోలను ఆమెకు ఇన్ స్టా ద్వారా పంపించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె మాకు ఫిర్యాదు చేశారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా మేము కేసు నమోదు చేశాం. ఆమెకు వీడియో పంపించిన ఐడిని గుర్తించాం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని” బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.

కాగా, ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజంలో పేరుపొందిన మహిళలకు కూడా భద్రత లేకుండా పోయిందని.. ఇక సామాన్య ఆడవాళ్ళ పరిస్థితి ఏంటని చాలామంది సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. స్పై కెమెరాలను కేవలం ప్రభుత్వం సూచించిన వారికే విక్రయించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version