Elderly couple Viral Video: చిన్న చిన్న కారణాలకే నేటి తరంలో దంపతులు విడిపోతున్నారు. సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.. కోర్టుమెట్ల దాకా ఎక్కి విడాకులు తీసుకుంటున్నారు. ఇక శ్రీమంతుల కుటుంబాల్లో అయితే విడాకుల వ్యవహారానికి హద్దు పద్దు లేకుండా పోతుంది. అప్పుడు దాకా కలిసి ఉన్నవారు బ్రేకప్ చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో అయ్యారంటే ఇద్దరి మధ్య మంట మొదలైందని అర్థం. ఇక నేటి తరం పిల్లల్లో ఆర్థిక స్థిరత్వం విపరీతంగా ఉంది. ఉన్నత చదువులు చదవడంతో ఉద్యోగాలు కూడా సులభంగా లభిస్తున్నాయి. దీంతో ఈగోలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇద్దరూ తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి మాటలు పెరిగిపోతున్న నేపథ్యంలో విభేదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మధ్యలో అటు ఇటు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ కావడంతో ఆ మంట మరింత పెద్దదవుతున్నది. అది కాస్త విడాకులకు దారితీస్తోంది. గడచిన దశాబ్ద కాలంగా దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
విడాకులు తీసుకుంటున్న వారిలో ఎక్కువగా యువ జంటలే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. చిన్న చిన్న విషయాలకే పట్టలేని ఆగ్రహానికి గురై.. చెప్పలేని కోపాలు పెంచుకొని విడాకులు తీసుకున్న నేటితరం దంపతులు ఒకసారి ఈ వీడియో చూడాలి. ఆ వీడియో చూసిన తర్వాత తాము ఏం కోల్పోతున్నామో.. తాము వేటికి దూరమవుతున్నామో తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా భార్యను ఎలా ప్రేమించాలో భర్త.. భర్తను ఎలా చూసుకోవాలో భార్య తెలుసుకోవాలి. సంసారాన్ని ఎలా సాగించాలి.. అన్యోన్యతను ఎలా పాటించాలి.. పదిమందిలో ఎలా ఉండాలి.. అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి. ఈ వీడియోలో ఇద్దరు వృద్ధులు ఉన్నారు. వారిని లెక్చర్లు ఇవ్వలేదు. కెమెరా ముందు నటించలేదు. జస్ట్ వారు అనుభవిస్తున్న జీవితాన్ని జీవించారు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించారు.
Also Read: జీవితంలో ఎదగాలనుకుంటే స్టీవ్ జాబ్స్ చెప్పిన.. ఈ పంచ సూత్రాలు పాటించాల్సిందే!
ఆ వృద్ధ దంపతులు ఎక్కడికో వెళ్తున్నారు. చూస్తుంటే రైల్లో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆ వృద్ధుడికి ఆమె టిఫిన్ పెడుతోంది. ఇడ్లీ తింటుంటే చెట్ని అయిపోవడంతో.. ఓ డబ్బాలో నుంచి తీసివేస్తోంది. అది కూడా ఆమె చట్నీ వేస్తుంటే అదే పనిగా చూస్తున్నాడు. ఇంకా కొంచెం చట్నీ వేయాలా అని ఆమె కనుసైగ చేస్తే.. దానికి అతడు కంటిచూపుతోనే వద్దు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. అతడు టిఫిన్ తినడం పూర్తయిన తర్వాత.. ఆమెకు కంట్లో మందు వేశాడు. చూడ్డానికి ఇవి గొప్ప దృశ్యాలు కావు. కానీ అంతకుమించిన దృశ్య కావ్యాలు. ప్రేమంటే గొప్ప గొప్ప వ్యక్తికరణలు కావు.. గొప్ప గొప్ప పనులు కూడా కావు.. ఎదుటి వ్యక్తి అవసరాలు తీర్చడం కూడా కాదు. జస్ట్ ఎదుటి వ్యక్తితో సమయాన్ని మనస్ఫూర్తిగా గడపడం.. వారి సాంగత్యంలో మైమరచిపోవడం.. ప్రేమంటే ఇంతే కదా.. ఇంతోటి దానికి గొడవలు ఎందుకు.. పరస్పరం ప్రతీకారాలు ఎందుకు. సింపుల్గా చెప్పాలంటే ప్రేమిద్దాం డూడ్.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..
View this post on Instagram