Steve Jobs Life Lessons: ఈ భూమి మీద మనిషి జన్మ ఎంతో ఉన్నతమైనది. సార్ధకమైనది కూడా. అందుకే ఈ జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే గొప్పగా జీవించాలి. గొప్పగా జీవించడం అంత సులువైన విషయం కాదు. దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పాటించాలంటే ఒక గొప్ప వ్యక్తి మార్గాన్ని అనుసరించాలి. అలాంటి గొప్ప వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. ఆపిల్ వ్యవస్థాపకుడిగా ఆయన ఆ కంపెనీని అత్యంత విలువైనదిగా మార్చారు. ఆయన ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆ కార్యక్రమాలలో మెరుగైన జీవనం గురించి మాట్లాడేవారు. ఇంతకీ ఆయన చెప్పిన ఆ మాటలు ఏంటంటే..
పిల్లలకు చదువు చెప్పించే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలట. తన పిల్లల్ని ధనవంతులను చేయడం కోసం చదివించకూడదని.. విలువలు తెలుసుకోవడానికి చదివించాలట. అప్పుడే వారికి ఎందుకు చదువుకోవాలో తెలుస్తుందట. తద్వారా జీవిత సారం కొంతలో కొంత అర్థమవుతుందట.
మనం తినే ఆహారాన్ని ఔషధాల లాగా తీసుకోవాలట. ఇష్టానుసారంగా తింటే అది అరగడానికి ఔషధాలు వేసుకోవాలట. అందువల్ల సాధ్యమైనంత వరకు తినే తిండి విషయంలో ఎరుకను ప్రదర్శించాలి. కంచం నిండా పెట్టుకొని.. కడుపునిండా తినేసి.. కంటి నిండా కునుకు తీ స్తే అది మంచిది కాదట. కొద్దిరోజుల వరకు ఇది బాగానే ఉంటుంది కానీ.. ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలవుతాయట.
ఉదయాన్నే లేచి సూర్యోదయాన్ని చూడాలట. సూర్యోదయంలో వ్యాయామం చేయాలట. వ్యాయామం చేసిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవాలట. విశ్రాంతి అనంతరం పోషకాలతో కూడిన ఆహారాన్ని తినాలట. ఆ తర్వాత విధినిర్వహణలో పాలుపంచుకోవాలట. అనంతరం స్నేహితులతో గడపాలట. వీటిలో ఏ ఒక్కటి కోల్పోయినా అది మనుషుల మనుగడ మీద ప్రభావం చూపిస్తుందట.
Also Read: టార్గెట్ జగన్.. కూటమి సర్కార్ లీక్..త్వరలో అరెస్ట్!
వేగంగా లక్ష్యాలను సాధించాలి అనుకున్నప్పుడు ఒంటరిగానే ప్రయాణం సాగించాలట. ఒకవేళ బృహత్తర లక్ష్యాలను సాధించాలి అనుకున్నప్పుడు కొంతమందితో కలిసి ప్రయాణం సాగించాలట.
నిజంగా ప్రేమించిన వ్యక్తి మనల్ని వదిలి వెళ్ళిపోరట. ఒకవేళ వెళ్ళిపోవాలి అని భావించిన వ్యక్తి అనేక కారణాలను మనకు ప్రతికూలంగా చెబుతారట. ప్రేమ అనేది కారణంతో కలగకూడదు.. కారణం వల్ల విడిపోకూడదట. పరస్పరం నమ్మకం లేనప్పుడు.. ఎదుటి వ్యక్తిపై అభిమానం లేనప్పుడు అది ప్రేమ కాదట. ధరణి ప్రేమ అని కూడా అనుకోకూడదట.
ఇవన్నీ కూడా స్టీవ్ జాబ్స్ అనేక పర్యాయాలు వివిధ సమావేశాలలో చెప్పారు. వాటిని ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ట్రెండ్ చేస్తున్నారు. కేవలం లక్షల కోట్ల వ్యాపార సంస్థకు అధిపతిగా మాత్రమే కాకుండా స్టీవ్ జాబ్స్ ఒక మానసిక విశ్లేషకుడిగా.. జీవితం మొత్తాన్ని చదివిన తాత్వికుడిగా అనేక విషయాలను చెప్పారు. అందువల్లే నేటికీ ఆయన చెప్పిన మాటలను చాలామంది అనుసరిస్తున్నారు. ఆచరిస్తున్నారు.
View this post on Instagram