Homeఅంతర్జాతీయంDoomsday Prediction 2026: యుగాంతం ఆరోజే.. డేట్‌తో సహా చెప్పిన సైంటిస్ట్‌!

Doomsday Prediction 2026: యుగాంతం ఆరోజే.. డేట్‌తో సహా చెప్పిన సైంటిస్ట్‌!

Doomsday Prediction 2026: యుగాంతం వస్తుంది.. త్వరలోనే ప్రళయం వస్తుంది అనే వార్తలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొందరు ఉటంకిస్తారు. బాబావంగా భవిష్యవాణిని మరికొందరు ఉటంకిస్తారు. ఇలా వివిధ పండితులు, సిద్దాంతుల అంచనాల ఆధారంగా యుగాంతంపై వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఓ సైంటిస్టు చెప్పిన తేదీ వైరల్‌ అవుతోంది. 1960ల్లో సిస్టమ్స్‌ థియరీ పితామహుడు కింజ్‌వాట్‌ ఫోస్టర్, భవిష్యత్తును ముందుగా చూసిన లెక్కలు వేశాడు. జ్యోతిష్యం కాదు, తత్వశాస్త్రం కాదు.. పూర్తిగా సైంటిఫిక్‌ మోడల్స్‌ ఆధారంగా. అతని లెక్కల ప్రకారం, 2026 నవంబర్‌ 13, శుక్రవారం నుంచి మానవ జాతి ముగుస్తుంది. ఇది సైన్స్‌ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అంచనా. ప్రకృతి విపత్తులు కాదు, మానవులు సృష్టించుకున్న ఒక అసాధారణ సమస్యే కారణం.

సిస్టమ్స్‌ థియరీ ద్వారా భయంకర అంచనా
ఫోస్టర్‌ సిస్టమ్స్‌ థియరీలో నిపుణుడు. అతను మానవ సమాజాన్ని ఒక డైనమిక్‌ సిస్టమ్‌గా చూశాడు. అణు ఆయుధాల సామర్థ్యం, గ్రహాంతర బెదిరింపులు, జనాభా వృద్ధి రేట్లు మేరకు. ఈ మూడు అంశాల సమ్మేళనం ‘అనంతత్వ బిందువు’ను సృష్టిస్తుందని అతను లెక్కించాడు. ఇక్కడ జనాభా పెరుగుదల అపరిమితంగా మారుతుంది, భూమి భారసాహారకతకు లోనవుతుంది. ఫలితంగా మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని అంచనా వేశాడు. ఇది సైబర్నెటిక్స్‌ (సిస్టమ్స్‌ కంట్రోల్‌ సైన్స్‌) ఆధారంగా వచ్చిన ముందస్తు హెచ్చరిక. ఈ లెక్కలు 60 ఏళ్ల క్రితం చేసినా, ఈరోజు జనాభా 8 బిలియన్లకు చేరడం, అణు ఆయుధాల సంఖ్య పెరగడం వల్ల మరింత భయంకరంగా మారాయి.

అంచనాలో వాస్తవం ఎంత?
ఫోస్టర్‌ లెక్కలు ఊహాజనితమే అయినా, అవి మనల్ని ఆలోచింపజేస్తాయి. జనాభా వృద్ధి రేటు (ప్రస్తుతం 0.8% వార్షికం) అణు ఆయుధాల బెదిరింపు (9 దేశాల్లో 13 వేలకుపైగా హెడ్స్‌)తో కలిస్తే, సిస్టమ్‌ అస్థిరత ఏర్పడుతుంది. ఉల్కల ప్రభావం అంచనా వేయడం కష్టం కానీ, నాసా డేటా ప్రకారం 1 కి.మీ. వ్యాసం ఉల్కలు ప్రతి సంవత్సరం భూమిని తాకే అవకాశం ఉంది. ఈ మూడు కారకాల సమ్మేళనం ’సింగులారిటీ’ లాంటి పాయింట్‌ను సృష్టిస్తుందా? ఆధునిక మోడల్స్, ప్రకృతి మార్పులను చేర్చి చూస్తే, ఈ తేదీ సమీపంలో గొప్ప సంక్షోభం రావచ్చు. అయితే, సాంకేతిక పురోగతి దీన్ని మార్చగలదు.

ఈ ప్రవచనం హెచ్చరిక సంకేతం. జనాభ నియంత్రణ, అణు నిర్వీర్యీకరణ, గ్రహాంతర రక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టాలి. ఫోస్టర్‌ లాంటి ఆలోచనలు మనల్ని ’సస్టైనబుల్‌ సిస్టమ్స్‌’ వైపు నడిపాయి. 2026 నవంబర్‌ 13 నిజంగా ముగింపు కాకుండా ఉండాలంటే, ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. ఇది భయం కాదు సమాజాలను బలోపేతం చేసే అవకాశం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular