https://oktelugu.com/

Dogs vs lions: గ్రామ సింహాల ముందు సింహాలు ఓడిపోయాయి.. కళ్లప్పగించుకొని చూడాల్సిన వీడియో ఇదీ..

 సింహాలు ఉన్న అడవిలోకి ఇతర జంతువులు వెళితే బతికి బట్ట కట్టవంటారు. అలాగే గ్రామ సింహాలు ఉన్న ఊళ్లల్లోకి ఆదమరిచి వెళితే కాలి పిక్కలు భద్రమంటారు. ఎందుకంటే అవి వెంటబడి కరిచే తీవ్రత అంతలా ఉంటుంది మరి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 21, 2024 / 02:25 PM IST

    Dogs Clash with Lion

    Follow us on

    Dogs vs lions :సాధారణంగా మనం డిస్కవరీ ఛానల్ లో సింహాలు సింహాలు పోట్లాడుకునే వీడియోలు చూస్తుంటాం. పులులు పరస్పరం దాడి చేసుకునే దృశ్యాలను చూసే ఉంటాం. కానీ చరిత్రలో తొలిసారిగా సింహాలు – గ్రామ సింహాలు పోట్లాడుకున్న దృశ్యాలను మాత్రం చూసి ఉండం. సోషల్ మీడియా అనేది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోలు కనిపించడం ఇదే తొలిసారి అనుకుంటా. వాస్తవానికి సింహం బలం, వేటాడే తీరు, పంజాను ప్రయోగించే తీరు విభిన్నంగా ఉంటుంది. అందుకే సింహాల జోలికి ఇతర జంతువులు వెళ్ళవు. సింహాలు గనుక మీద పడితే పుట్టగతులు ఉండవు. అవి వెటాడి వెంటాడి, చీల్చి చెండాడుతాయి. అందుకే సింహాలను అడవులకు మృగరాజులు అని పిలుస్తుంటారు.. అయితే సోషల్ మీడియాలో వ్యాప్తిలో ఉన్న ఒక వీడియోలు సింహం – గ్రామ సింహాలు పోట్లాడుకున్నాయి. ఆ వీడియోలో చూపించినట్టు గ్రామ సింహాలదే పై చేయి అయింది.

    సోషల్ మీడియాలో తెగ గింగిరాలు తిరుగుతున్న ఒక వీడియోలో.. ఓ ప్రాంతంలో దట్టమైన చీకటి అలముకుంది. బహుశా ఆ సమయం రాత్రి కావచ్చు. ఒక దగ్గర గేటు వేసి ఉంది. ఇటువైపు సింహాలు ఉన్నాయి. అటువైపు గ్రామ సింహాలు ఉన్నాయి. మరి అవి ఆదమరచి వచ్చాయో.. లేకుంటే గ్రామ సింహాలను తినాలని వచ్చాయో తెలియదు కాని.. గేటు అవతల ఉన్న వాటి మీద ఉన్నట్టుండి ఒక్కసారిగా దాడి చేయాలని భావించాయి. అయితే ఆ గ్రామ సింహాలు తోక ముడవకుండా.. సింహాలను ధైర్యంగా ఎదిరించాయి. తమ అరుపులతో సింహాలను భయపెట్టాయి. దీంతో సింహాలు తోకముడిచి వెనక్కి వెళ్లిపోయాయి. అవి వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ గ్రామ సింహాలు ఏమాత్రం తగ్గలేదు. పైగా తమ అరుపుల తీవ్రతను మరింత పెంచాయి. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వీక్షణలను సొంతం చేసుకుంది.

    ” గ్రామ సింహం అంటే గ్రామానికి రాజు. మృగరాజులు అయినంత మాత్రాన సింహాలు గ్రామసింహాల ముందు తల వంచాల్సిందే. దెబ్బకు తోక ముడిచి పారిపోయాయి. అందు గురించే గ్రామ సింహాలను తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో.. బహుశా సింహాలకు రాత్రిపూట పస్తులే అనుకుంటా.. వేటాడుదాం అనుకొని వచ్చాయి.. ఇప్పుడు ప్రతిఘటన ఎదురు కావడంతో నిరాశతో వెళ్లిపోతున్నాయి. అందుకే బలం ఉందని విర్రవిగొద్దు.. బలహీనులు కూడా ఒక్కోసారి బలాన్ని పెంచుకుంటారు. తీవ్రమైన ప్రతిఘటనను రుచి చూపిస్తారు. అప్పుడు బలవంతులు నిశ్శబ్దంగా ఉండి పోవాల్సి వస్తుంది. ఒక్కోసారి పరాజయ భారంతో తోక ముడిచి వెళ్లి పోవాల్సి వస్తుందని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.