Emanating From Dead Bodies: మృతదేహాల నుంచి వెలువడే దుర్వాసన మనుషులపై ప్రభావం చూపుతుందా? ఈ పరిశోధనల్లో తేలిందేమిటి?

ఆ తరువాత ప్రయోగంలో పుట్రెస్పిన్ స్మెల్ చేసిన వారు ఏ విధంగా ప్రవర్తించారో గుర్తించారు. ఇందుకోసం పైన చెప్పిన మూడు రకాల స్మెల్ ను చూడమని అన్నారు. ఆ తరువాత 80 మీటర్లు నడవమని చెప్పారు. వారు నడిచినప్పుడు వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో గుర్తించారు

Written By: Srinivas, Updated On : October 26, 2024 11:11 am

Dead-Bodys

Follow us on

Emanating From Dead Bodies: మనిషి బతికి ఉన్నంతసేపు తనకు తానుగా కొన్ని ఆరోగ్య క్రియలు నిర్వహించుకుంటాడు. దీంతో అతని నుంచి ఎటువంటి సువాసన వెదజల్లదు. కానీ చినిపోయిన తరువాత మృతదేహం నుంచి అనేక రకాల దుర్వాసనలు వస్తుంటాయి. శరీరంలోని రక్త ప్రసరణతో పాటు మరికొన్ని క్రియలు ఆగిపోతాయి. దీంతో మృతదేహం నుంచి అదో రకమైన స్మెల్ వస్తుంటుంది. దీని నుంచి తప్పించుకునేందుకు ఆగర్ బత్తిలు వెలిగిస్తారు. అయినా వాటిని అధిగమిస్తూ తెలియని ఒక దుర్వాసన వస్తుంటుంది. అయితే ఈ దుర్వాసన అక్కడున్న వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ వాసనను పీల్చుకోవడం వల్ల వారిలో ఎలాంటి లక్షణాలు ఏర్పడుతాయి? అనే దానిపై కొందరు శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. వీరు చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే?

మనిషి బతికున్నంత సేపే విలువ.. చనిపోయిన తరువాత ఆ దేహానికి ఎటువంటి జీవం ఉండదు. అయితే ఈ దేహాన్ని ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని ప్రాంటియర్స్ పరిశోధకులు రీసెర్చ్ చేశారు. వీరి పరిధోనల ప్రకారం.. మృతదేహాల నుంచి పుట్రెస్సిన్ అనే సువాసన విడుదల అవుతుందని గుర్తించారు. దీనిని స్మెల్ చేయడం వల్ల మానవుల్లో కొన్ని వింత లక్షణాలు కనిపించాయని తెలిపారు. ఇందుకోసం మూడు రకాల ప్రయోగాలు నిర్వహించారు.

ఈ పరిశోధనలో భాగంగా ముందుగా ఓ కంప్యూటర్ ను తీసుకున్నారు. ఇందులోని మానిటర్ పై ఎరుపు చుక్కను ఏర్పాటు చేశారు. ఆ తరువాత ఓ కాటన్ పై పుట్రెస్పిన్, అమ్మోనియా, నీరులోని ఒక్కో ద్రావణాన్ని మార్చి మార్చిచల్లారు. ఆ తరువాత దానిని స్మెల్ చేయమన్నారు. అనంతరం మానిటర్ పై ఏర్పాటు చేసిన ఎర్ర చుక్కను గుర్తించాలని కోరారు.

ఆ తరువాత ప్రయోగంలో పుట్రెస్పిన్ స్మెల్ చేసిన వారు ఏ విధంగా ప్రవర్తించారో గుర్తించారు. ఇందుకోసం పైన చెప్పిన మూడు రకాల స్మెల్ ను చూడమని అన్నారు. ఆ తరువాత 80 మీటర్లు నడవమని చెప్పారు. వారు నడిచినప్పుడు వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో గుర్తించారు. మూడో ప్రయోగంలో ఒక వర్డ్ ను ఏర్పాటు చేసి దానిని అందులో ఒక లెటర్ ను మిస్ చేశారు. దీనిని గుర్తించాలని చెప్పారు. చివరగా కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ వాటికి సమాధానం చెప్పాలని అడిగారు.

అయితే మొత్తం ప్రయోగాల్లో మూడు రకాల వాసనలను పసిగట్టిన తరువాత మనుషులు ఏ విధంగా ఉన్నారని తేల్చారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారు ఒక పనిని అప్పగించిన తరువాత దానిని త్వరగా పూర్తి చేయాలన్న తపనతో కనిపించినట్లు గుర్తించారు. మృతదేహాల నుంచి వెలువడే దుర్వాసనలను మనుషులు స్మెల్ చేయడం వల్ల ఆక్కడి పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని చూస్తున్నట్లు గుర్తించారు.దీనిని బట్టి తేలిందంటేంటే పుట్రెస్పిన్ మానవులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని గుర్తించారు. ముఖ్యంగా రెండు ప్రయోగంలో 80 మీటర్లు నడవాలని సూచించినప్పుడు వేగంగా నడవడం వారు గుర్తించారు. ఇది మానవులకు అలర్ట్ నెస్ ను తెస్తుందని పరిశోధకులు చెప్పారు