https://oktelugu.com/

Venkatesh : ఆ స్టార్ హీరోయిన్ తో వెంకటేష్ రహస్య ప్రేమాయణం, పెళ్ళికి కూడా సిద్ధం.. అంతలో ఊహించని షాక్!

పెళ్ళై పిల్లలు ఉన్న హీరో వెంకటేష్ ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట. ఆమెను వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నాడట. ఆమెతో వరుస సినిమాలు చేస్తూ దగ్గరయ్యాడట. అప్పుడు అనూహ్య పరిణామం చోటు చేసుకుందట. వెంకీ రియల్ లవ్ స్టోరీ ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : October 26, 2024 / 11:13 AM IST

    Venkatesh's secret love affair with that star heroine, even getting ready for marriage...an unexpected shock!

    Follow us on

    Venkatesh : హీరోలు, హీరోయిన్స్ ప్రేమలో పడటం సాధారణమే. చాలా మంది నటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, రాజశేఖర్, మహేష్ బాబు, నాగ చైతన్య, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు తమతో నటించిన హీరోయిన్స్ తో ఏడడుగులు వేశారు. వెంకటేష్ దగ్గుబాటి మాత్రం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. వెంకటేష్ భార్య, పిల్లలు గురించి తెలిసింది తక్కువే. ముఖ్యంగా వెంకటేష్ భార్య అసలు ప్రచారం కోరుకోరు. సినిమా వేడుకల్లో ఆమె పాల్గొన్న సందర్భం లేదు. 
     
    ఇదిలా ఉంటే.. ఓ హీరోయిన్ తో వెంకటేష్ ప్రేమలో పడ్డాడట. అది కూడా పెళ్లయ్యాక. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు సౌందర్య. వీరిద్దరి కాంబోలో అరడజనుకు పైగా సినిమాలు వచ్చాయి. ఒక దశలో వరుస చిత్రాలు చేశారు. సూపర్ పోలీస్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా, జయం మనదేరా చిత్రాల్లో సౌందర్య, వెంకటేష్ జంటగా నటించారు. వీటిలో చాలా సినిమాలు విజయం సాధించాయి. 
     
    ముఖ్యంగా రాజా, జయం మనదేరా భారీ హిట్స్ అని చెప్పొచ్చు. వెంకటేష్ తన సినిమాల్లో సౌందర్యకు ఛాన్సులు ఇవ్వడం వెనుక కారణం.. ఆమెతో ఉన్న రిలేషన్ అట. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడ్డారట. రహస్యంగా ప్రేమాయణం సాగించారట. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. సౌందర్య సోదరుడి వివాహానికి వెంకటేష్ మాత్రమే టాలీవుడ్ నుండి హాజరయ్యాడట. 
     
    సౌందర్య-వెంకటేష్ ప్రేమ వ్యవహారం నిర్మాత రామానాయుడు వద్దకు చేరిందట. ఆయన సీరియస్ అయ్యాడట. ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఏంటని.. వెంకటేష్ ని నిలదీశాడట. అటు సౌందర్యపై కూడా ఆయన సీరియస్ అయ్యాడట. ఈ ఘటన అనంతరం వెంకటేష్, సౌందర్య దూరమయ్యారట. తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారట. గతంలో ఈ వాదన గట్టిగా వినిపించింది. ఈ పుకార్లలో నిజం ఎంత అనేది తెలియదు. 
     
    ఇక సౌందర్య అన్ని ప్రధాన భాషల్లో నటించింది. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ ఆమె జీవితం అర్థాంతరంగా ముగిసింది. సౌందర్య 2003లో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్ళై ఏడాది గడవక ముందే 2004లో విమాన ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో సౌందర్య సోదరుడు కూడా కన్నుమూశాడు. సౌందర్య నటించిన చివరి చిత్రం శివ శంకర్. బాలకృష్ణ డ్రీం ప్రాజెక్ట్ నర్తనశాలలో సౌందర్య ద్రౌపది పాత్ర చేయాల్సింది. ఆమె మరణంతో ఆ సినిమాను బాలకృష్ణ ఆపేశాడు.