https://oktelugu.com/

Oldest Company: ప్రపంచంలో అతి పురాతనమైన కంపెనీ ఎక్కడ ఉందో తెలుసా?

1400 సంవత్సరాలు అంటే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం వరకు చాలా దేశాలు ఛిన్నా భిన్నం అయ్యాయి. ముఖ్యంగా జపాన్ గుండెలపై అణుబాంబ్ తో అక్కడ వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది. కానీ అంతకంటే ముందే జపాన్ లో ఓ కంపెనీ ఏర్పాటయింది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 29, 2024 / 07:00 AM IST

    Oldest Company

    Follow us on

    Oldest Company: ఒక కంపెనీ ఏర్పాటు చేసిన తరువాత ఏన్నాళ్లు కొనసాగుతుంది? అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు లాభాలు ఉంటేనే ఆ కంపెనీ కొనసాగుతుంది. లేకుంటే దానిని మూసేస్తారు. లేదా మిగతా వారు టేకోవర్ చేస్తారు. అయితే చాలా మంది టేకోవర్ చేయడం కంటే మూసి వేసిన కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలా కంపెనీలు ఏర్పడి కొన్నాళ్లు మనుగడలో ఉండి.. ఆ తరువాత కనుమరుగైపోయాయి. కానీ కొన్ని కంపెనీలను పురాతన కాలంలో ఏర్పాటు చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? అంతేకాకుండా వెయ్యి సంవత్సరాలకు పైగా కొన్ని కంపెనీలు ఉన్నాయంటే మాత్రం అస్సలు నమ్మరు. కానీ ఇది నిజం. ఒక కంపెనీ 1400 ఏళ్ల పాటు కొనసాగుతూ ప్రపంచంలోనే అతి పురాతన కంపెనీగా పేరు తెచ్చుకుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏది? మనదేశంలో అతి పురాతన కంపెనీలు ఏవి?

    1400 సంవత్సరాలు అంటే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం వరకు చాలా దేశాలు ఛిన్నా భిన్నం అయ్యాయి. ముఖ్యంగా జపాన్ గుండెలపై అణుబాంబ్ తో అక్కడ వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది. కానీ అంతకంటే ముందే జపాన్ లో ఓ కంపెనీ ఏర్పాటయింది. దాని పేరు ‘కొంగో గుమి’. దీనిని 578 ADలో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ భవన నిర్మాణాలు చేపడుతుంది. దీనిని కొరియన్ బిల్డర్ షిగెమిషు కాంగో ఏర్పాటు చేశారు.

    కొంగో గుమి ఏర్పాటు అయిన తరువాత రెండు ప్రపంచ యుద్దాలుజరిగాయి. అలాగే అణుబాంబ్ ను ఎదుర్కొంది. ఆ తరువాత బ్రిటిష్ వారి కోరల నుంచి గట్టెక్కి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కంపెనీ ద్వారా అనేక దేవాలయాలు, భవనాలు నిర్మించబడ్డాయి. కొంగో గుమి తరువాత రెండో అతిపురాతనమైన కంపెనీ మారుబేని కార్పొరేషన్ దీని ద్వారా అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఈ కంపెనీనిని 1643లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ కొనసాగుతోంది.

    భారత్ లోనూ అతి పురాతనమైన కంపెనీలు ఉన్నాయ. ఇండియాలో అతి పురాతనమైన కంపెనీ కిర్లోస్కర్. దీని ద్వారా వ్యవసాయ పంపులు, ఇంజన్లు తయారవుతాయి.కిర్లోస్కర్ బ్రాండ్ కు మార్కెట్లో మంచి ఇమేజ్ ఉంది. రైతులు ఎక్కువగా దీనినే కొనుగోలు చేస్తారు. కిర్లోస్కర్ కంపెనీని 1888లో ప్రారంభించారు. ఆ తరువాత వోల్టాస్ అనే కంపెనీ కూడా పురాతనమైనదే. దీనిని 1850లో ఏర్పాటు చేశారు. ఇది ఎయిర్ కండీషన్లను తయారు చేస్తుంది.

    ఇక ప్రస్తుతం ఉన్న ప్రధాన కంపెనీల్లో గోద్రెజ్ గురించి అందిరికీ తెలసిందే. దీనిని 1894లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ నుంచి ముందుగా సబ్బులు తయారు చేశారు. ఆ తరువాత బీరువాలు, తదితర గృహోపకరణాలు తయారు చేస్తున్నారు. ఈ కంపెనీ తరువాత ఎన్నో మార్కెట్లోకి వచ్చినా.. గోద్రెజ్ వస్తువులకు ఆదరణ అలాగే ఉంది. గోద్రెజ్ ఏర్పాటు చేసినకాలంలో బ్రిటిష్ పాలన కొనసాగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ కొనసాగడం విశేషం.