https://oktelugu.com/

Home Tips: గృహ ప్రవేశం చేసే ముందు హోమం, పూజలు ఎందుకు చేస్తారు?

ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించే ముందు హోమం నిర్వహిస్తారు. అలాగే ఇల్లు నిర్మించుకున్న తరువాత గృహ ప్రవేశ సమయంలో వివిధ పూజలు చేసిన తరువాతే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇవన్నీ ఊరికే చేయరు. వీటి నిర్వహణ వెనుక అనేక అర్థాలు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : September 29, 2024 / 06:06 AM IST

    Griha Pravesh Puja

    Follow us on

    Home Tips: భారతదేశం ఆధ్యాత్మిక నిలయం అని అంటారు. పూజలు, వ్రతాలు, నోములు ఈ దేశంలో ఎక్కువగా నిర్వహిస్తారు. ఏ పని ప్రారంభించినా కచ్చితంగా ఏదో ఒక పూజను నిర్వహిస్తారు. అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా.. గృహ ప్రవేశం చేయాలన్నా హోమాలు, వ్రతాలు నిర్వహిస్తారు. అయితే చాలా మంది పెద్దలు చెప్పిన విధంగా హోమాలు, పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇవి ఎందుకు చేస్తున్నారు? అని అడిగితే ఎవరు సమాధానం చెప్పడం లేదు. తమ పెద్దలు చెప్పిన ప్రకారంగా చేస్తున్నాం.. అని అంటున్నారు. అసలు హోమాలు, వ్రతాలు, పూజలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా?

    ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించే ముందు హోమం నిర్వహిస్తారు. అలాగే ఇల్లు నిర్మించుకున్న తరువాత గృహ ప్రవేశ సమయంలో వివిధ పూజలు చేసిన తరువాతే ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇవన్నీ ఊరికే చేయరు. వీటి నిర్వహణ వెనుక అనేక అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా హోం నిర్వహించడం వల్ల సకల దేవతల ఆగ్రహాన్ని చల్లారుస్తారట. అప్పటికే చేసిన తప్పుల నుంచి తమకు విముక్తి కలిగించాలని హోమం ద్వారా వేడుకుంటారట. అందుకే హోం నిర్వహించే సమయంలో అగ్నితో సహా పంచభూతాలన్నింటిని వేడుకుంటూ తమ తప్పులను మన్నించమని కోరుతారట.

    అయితే హోమం నిర్వహించేవారు చేసిన తప్పేంటి? అనే సందేహం వస్తుంది. ఒక ఇల్లు లేదా ఒక ప్రాజెక్టు నిర్మించడానికి భూమిని చదును చేయాల్సి ఉంటుంది. అయితే అప్పటికే ఆ నేలను నమ్ముకొని ఎన్నో జీవులు ఉంటాయి. వీటిలో కొన్ని చెట్లను కూడా తొలగించాల్సి వస్తుంది. అయితే హిందూ శాస్త్రం ప్రకారం భూమ్మీద ఉన్న ప్రతీ జీవికి హక్కు ఉంటుంది. అవి నమ్ముకున్న నేలను వేరేవాళ్లు సొంతం చేసుకుంటే అవి బాధపడుతాయి. అంతేకాకుండా నేలను చదును చేసే క్రమంలో కొన్ని జీవులు మరణిస్తాయి. ఇలా చేయడం వల్ల కొందరు దేవతలు మనుషులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కానీ ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరి అవసరం. అది తప్పదు. అయితే ఈ పాపం నుంచి విముక్తి పొందాలని హోం నిర్వహిస్తారని ఆధ్యాత్మిక శాస్త్రం తెలుపుతుంది.

    ఇల్లు నిర్మించే సమయంలో వాస్తు ప్రకారం కట్టుకోవాలని అంటారు. వాస్తు అనేది ఇంటికి మంచి జరగాలని మాత్రమే కాకుండా ఇంట్లోకి గాలి, వెలుతురు సక్రమంగా వచ్చేలా ఉపయోగపడుతుంది. వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఇంట్లో వాళ్లు ఆరోగ్యంగా ఉంటరని అంటారు. అంటే ఇంట్లోకి సరైన వాతావరణం ప్రసరించడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాలు పొంగిస్తారు. ఇంట్లో సుఖ శాంతులు నెలకొల్పాలని ఇలా నిర్వహిస్తారు.

    ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటేనే కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకోసం ఇంటికి పచ్చ తోరణం, నిత్య పూజలు వంటివి చేయాలని అంటారు. అయితే ఇవి మూఢ నమ్మకాలు అని కొందరు కొట్టి పారేసినా ప్రశాంతమైన వాతావరణం కోసం నిత్య పూజలు చేయడం ఎంతో ఉత్తమం. ప్రతిరోజూ దీప, దూపం వెలిగించడం వల్ల ఇంట్లోని గాలిలో ఉన్న కలుషిత వాతావరణం స్వచ్ఛంగా మారుతుంది. గుమ్మం ముందు పచ్చతోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి బ్యాక్టీరియా రాకుండా అడ్డుకుంటుంది. ఇలా ప్రతీ పూజ, హోమం, వ్రతం మనుషుల ఉపయోగాల కోసం ఏర్పాటు చేసినవే.