Diwali Gifts: నేడు దీపావళి పండుగ. యావత్ దేశం మొత్తం దీపాల కాంతులతో వెలిగిపోతోంది. పండుగ సంబరంతో సందడిగా ఉంది. కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా బాణసంచా కాల్చుతున్నారు. యువతులు దీపాల ప్రమిదలను కొనుగోలు చేసి.. ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు. సాయంత్రమైతే దీప కాంతులతో దేశం మొత్తం వెలిగిపోతుంది.
దీపావళి పండుగను చెడుపై మంచి సాధించిన గుర్తుగా చేసుకుంటారు. దీపావళి నాడు మనదేశంలో ఆయా ప్రాంతాలను బట్టి వేడుకలు జరుపుకుంటారు. ఇక ప్రైవేట్ కంపెనీలు అయితే తమ ఉద్యోగులకు బోనస్ లు ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు మిఠాయి ప్యాకెట్లు ఇచ్చి వారిలో ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. ఐటి, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలు అయితే తమ ఉద్యోగులకు విలువైన కానుకలు ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు రకరకాల బహుమతులు ఇచ్చి ఆనందింపజేస్తుంటాయి. అయితే దీపావళి వేడుక సందర్భంగా ఓ కంపెనీ మాత్రం ఉద్యోగులకు ఊహించని బహుమతులు ఇచ్చింది.
చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ ఫార్మా కంపెనీ దీపావళి సందర్భంగా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బంపర్ బహుమతులు ఇచ్చింది. ఫార్మా కంపెనీ యజమాని ఎంకే భాటియా తన ఉద్యోగులకు ఏకంగా 51 కొత్త కార్లను బహుమతులుగా ఇచ్చాడు. ఆ కార్లు మొత్తం ఎస్ యూ వీ, స్కార్పియో వాహనాలు కావడం విశేషం. భాటియా తన సంస్థ వృద్ధికి ఉద్యోగులు కృషి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వాహనాలు మాత్రమే కాకుండా, అత్యంత ఖరీదైన మిఠాయి ప్యాకెట్లను కూడా ఉద్యోగులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కొన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు ఖరీదైన కానుకలతో పాటు నగదు బహుమతులు కూడా ఇచ్చినట్టు సమాచారం.
ఆ ఫార్మా కంపెనీ ఈ ఏడాది అత్యంత వృద్ధిరేటును నమోదు చేసింది. ఔషధాల ఎగుమతిలో సరికొత్త మైలురాయిని అందుకుంది. అందువల్లే తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు భాటియా ఈ స్థాయిలో బహుమతులు ఇచ్చారని తెలుస్తోంది. బహుమతులు అందుకున్న తర్వాత ఉద్యోగులు భాటియాను అభినందనలతో ముంచెత్తారు.. శాలువాలు కప్పి సన్మానించారు. కంపెనీని ఇలానే అభివృద్ధిలోకి తీసుకొస్తామని.. మరింత కష్టపడి పనిచేసి సంస్థను ఒక స్థాయిలో నిలబెడతామని ఉద్యోగులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్లు తీసుకున్న తర్వాత యాజమాన్యానికి తమదైన శైలిలో కృతజ్ఞతలు తెలియజేశారు.
दीपावली पर स्टाफ को गिफ्ट में दीं 51 कारें: चंडीगढ़ में फार्मा कंपनी के मालिक की पहल, गाड़ियों में SUV-स्कॉर्पियो शामिल https://t.co/mN3xR3WWiO #Dipawali2025 #DiwaliGift #HindiNews pic.twitter.com/k556bIxVmn
— Dainik Bhaskar (@DainikBhaskar) October 19, 2025