Tunnels And Rooms Under The House: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలన.. ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. కొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.. మరికొన్ని విషయాలు భయపెడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ న్యూస్ ఆసక్తి రేపుతుంది. ఒక వ్యక్తి ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత అతడు ఊహించని విధంగా రహస్య గదులు బయటపడ్డాయి. అందులోకి వెళ్లి చూసేసరికి అతనికి ఏం జరిగిందో తెలుసా?
రహస్య గదులు అనగానే మనకు పద్మనాభ స్వామి ఆలయం గుర్తుకువస్తుంది. ఈ ఆలయం కింద ఉన్న రహస్య గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందులో మరో గదిని తెరవ లేక పోయారు. అప్పటినుంచి ఏవైనా రహస్య గదులు బయటపడితే వెంటనే అందులో ఏముందో తెలుసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కొన్ని ప్రమాదాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే పురాతన కాలంలో వారి అవసరాలకు అనుగుణంగా ఈ గదులను నిర్మించారు. ఇప్పటి వారు ఆ గదుల్లోకి వెళితే ఆరోగ్యంగా ఉండలేకపోతుంటారు.
అలాగే రెడిక్ అనే సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఇల్లును కొనుగోలు చేయగా.. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి కింద రహస్య గదులు బయటపడ్డాయి. ఈ గదులు ఐదు ఉన్నాయి. అయితే రహస్య గదులు అనగానే అందులో ఏదైనా నిధులు ఉన్నాయని.. ఆ వ్యక్తి ఆశ కొద్దీ కిందికి వెళ్ళాడు. కానీ లోపలికి వెళ్తున్న కొద్దిగా అతనికి శ్వాస ఆడలేదు. ఎందుకంటే ఆ గదిలోకి గాలి కూడా చొరబడకుండా ఉంది. అయితే అందులో అంతకుముందు ఉన్నవారు కిందికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ గదిలో ఒక ట్యూబ్ లైట్ వెలుగుతూ ఉంది. కానీ అందులోకి మాత్రం గాలి రాకపోవడంతో శ్వాస ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. కానీ ఆ గదిలో విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని అతడు కొన్ని ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ గదులను కనుగొన్నాను అని క్యాప్షన్ పెట్టాడు.
దీంతో చాలామంది ఈ గదులపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరికొంత లోపలికి వెళ్లి సెర్చ్ చేస్తే నిధులు దొరికే అవకాశం ఉండేది అని కొందరు కామెంట్ చేయగా.. మరికొందరు ఈ గదుల సందర్శనార్థం టికెట్ ఏర్పాటు చేయండి అని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ గదులు ఎక్కడ ఏంది అనేది పూర్తి వివరాలు వెల్లడించలేదు. బహుశా అతడు వివరాలు చెబితే అక్కడికి పోలీసులు వచ్చే అవకాశం ఉందని అనుకున్నాడు కావచ్చు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇవి ఎక్కడ కనుగొన్న పడ్డాయో అని ఆరా తీస్తున్నారు.