Disability to Billionaire Journey India: ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నవారు.. అవరోధాలను అధిరోహించినవారు.. జీవితంలో గొప్పగా స్థిరపడతారు. తాము స్థిరపడమే కాకుండా.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు. ప్రపంచానికి ఆదర్శంగా ఉంటారు. అలాంటి వారిలో విశాల్ మార్ట్ అధినేత రామచంద్ర అగర్వాల్ కూడా ఒకరు. రామచంద్ర అగర్వాల్ అందరిలాగానే జన్మించినప్పటికీ.. అతనికి ఉన్న వైకల్యం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. బాల్యంలో పోలియో బారిన పడిన నేపథ్యంలో నడవడమే ఆయనకు ఇబ్బందిగా ఉండేది. చుట్టుపక్కల వారు అతడిని హేళన చేసేవారు. బంధువులు జాలి చూపించేవారు. ఇవన్నీ కూడా అతడికి నచ్చేవి కాదు. వారందరికీ అతడు తనను తనలాగే చూడాలని చెప్పేవాడు. కాకపోతే వారు అలా చూడకపోవడంతో అతనిలో కసి పెరిగిపోయింది. అనేక ప్రయత్నాల తర్వాత అతడు ఏకంగా వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.
విశాల్ మార్ట్ ఏర్పాటు చేయడానికి అగర్వాల్ తీవ్రంగా కష్టపడ్డాడు. ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా ముందుకు సాగాడు.. విశాల్ మార్క్ అంటే ముందు ఆయన అనేక రకాల వ్యాపారాలు మొదలుపెట్టాడు. అందులో కొన్ని వ్యాపారాలు విజయవంతమైతే.. మరికొన్ని విఫలమయ్యాయి. అయితే అన్ని రకాల వస్తువులు అంటే పచారి సామగ్రి నుంచి మొదలుపెడితే దుస్తుల వరకు ప్రతిదీ కూడా తన వద్ద లభించాలని కోరుకునే వాడు అగర్వాల్. ఆ దిశగానే 2002లో విశాల్ మార్ట్ ఏర్పాటు చేశాడు. అయితే కొద్దిరోజులు లాభాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత మార్కెట్లో ఉన్న పోటీకి అనుగుణంగా తన సంస్థను మలచలేకపోవడంతో విపరీతంగా నష్టాలు వచ్చాయి. దీంతో 2008లో విశాల్ మార్ట్ అనే సంస్థను ఆయన అమ్మేశాడు. దీంతో వీ-2 రిటైల్ అనే కంపెనీ స్థాపించాడు. దానిని అత్యంత విజయవంతంగా కొనసాగించాడు. ఫలితంగా లాభాలు కళ్ల చూడటం మొదలుపెట్టాడు.
ఎక్కడైతే నష్టాల వల్ల తన సంస్థను అమ్మాడో.. వారి ముందే కాలర్ ఎగరేశాడు. ఏకంగా తన సామ్రాజ్యాన్ని 6,572 కోట్లకు విస్తరించాడు. ప్రస్తుతం మనదేశంలో డిమార్ట్, రిలయన్స్, తర్వాత ఆ స్థాయిలో రిటైల్ బిజినెస్ కలిగి ఉన్న సంస్థగా వీ-2 కంపెనీ నిలిచింది. అన్నట్టు తనకు వైకల్యం ఉన్నప్పటికీ అగర్వాల్ ఏమాత్రం లెక్క చేయలేదు. తనను చాలా మంది అవహేళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. చివరికి వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి.. వేలాదిమందికి ఉపాధి కల్పించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించాడు అగర్వాల్. అంతేకాదు తనకు ఉన్న వైకల్యం కేవలం భౌతిక పరమైనదేనని.. తన శారీరక శక్తిని అది ఏమాత్రం అడ్డుకోలేదని.. అది అడ్డు కాదని నిరూపించాడు అగర్వాల్. అన్నట్టు అగర్వాల్ విభిన్నమైన వ్యాపారాలను ఏర్పాటు చేయడానికి అడుగులు వేస్తున్నాడు. ఇందులో భాగంగానే కలిసివచ్చే వ్యాపార భాగస్వాముల కోసం ఆయన సెర్చ్ చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అతడు కొత్త వ్యాపారం లోకి ప్రవేశించే అవకాశం ఉంది.