Champions Trophy 2025: దివ్యాంగ ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy for disabled persons) ఫైనల్ మ్యాచ్ (final match) శ్రీలంకలో జరిగింది. ఈ మ్యాచ్లో భారత్, ఇంగ్లాండ్ జట్టు తలపడ్డాయి.. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 197 రన్స్ చేసింది. భారత్ విధించిన 198 రన్స్ టార్గెట్ ను చేదించడంలో ఇంగ్లాండ్ విఫలమైంది. కేవలం 118 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
అతడే మ్యాచ్ మలుపు తిప్పాడు
ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాడు యోగేంద్ర భదోరియా(Yogendra bhadoriya) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నలభై బంతులను ఎదుర్కొన్న అతడు.. నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 73 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లు కూడా రాధిక ప్రసాద్(Radhika Prasad) 3.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ విక్రాంత్ కె ని (captain Vikrant cany) బోర్డు ఓవర్లు బౌలింగ్ వేసి పదిహేను పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర సంటే(Ravindra sante) 24 పరుగులకు, రెండు వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి స్వల్ప స్కోర్ అయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు కచ్చితంగా దానిని చేదిస్తుందని అందరూ అనుకున్నారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా అలానే కనిపించారు. కానీ మన బౌలర్లు కీలక సమయంలో వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండు జట్టు ఏమాత్రం కోలుకోలేకపోయింది. మరోవైపు ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. దీటుగానే పరుగులు చేసింది. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు సులభంగా రావడం సాధ్యమైంది. అందువల్లే భారత జట్టు ఆ స్థాయిలో స్కోరు సాధించగలిగింది.
దివ్యాంగ క్రికెట్ కౌన్సిల్ హర్షం
భారత దివ్యాంగ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకోడంతో సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. DCCI (Disable cricket council of India) తన సామాజిక మాధ్యమాలలో భారత దివ్యాంగ జట్టు సాధించిన విజయాన్ని గొప్పగా ప్రస్తావించింది. ” మన క్రీడాకారులు అదరగొట్టారు. కృషిని ప్రదర్శించారు. దృఢ సంకల్పాన్ని నెలకొల్పారు. నైపుణ్యాన్ని చూపించారు. అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని” ప్రశంసలు కురిపించింది. ఇక ఈ టోర్నీలో భారత కెప్టెన్ విక్రాంత్ జట్టును అన్ని తానై నడిపించాడు. ” ఇది గర్వంతో ఉప్పొంగే విషయం. నాకు ఆటగాడిగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా సంతోషాన్ని ఇస్తోంది.. ప్రతి మ్యాచ్ లోనూ మేము నూటికి నూరు శాతం మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. అందువల్లే ఈ విజయం సాధ్యమైంది. జట్టు ప్రయాణంలో ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడారు. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. అందువల్లే భారత్ ఈ చారిత్రాత్మక విజయం సాధించింది. వైకల్యం ఉన్నవారు బాధపడాల్సిన అవసరం లేదు. అవకాశాలను అందిపుచ్చుకుంటే కచ్చితంగా విజయాలు సాధిస్తారని” విక్రాంత్ వ్యాఖ్యానించాడు.