Desert Plants: ఎడారిలో ఏడాదికి ఒక్కరోజు కూడా వర్షం కురవదు. ఒకవేళ కురిసినా ఏదో తుంపర్ల మాదిరిగానే ఉంటుంది. నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. ఎక్కడో ఓచోట ఒయాసిస్ ప్రాంతంలో నీరు నిల్వ ఉన్నప్పటికీ.. అక్కడ పెద్దగా మొక్కలు పెరిగినట్టు.. వృక్షాలుగా ఎదిగినట్టు దాఖలాలు కనిపించవు.. అయితే అంత ఎడారిలో కూడా కొన్నిచోట్ల మొక్కలు పెరుగుతున్నాయి. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. ఇటీవల అధ్యయనాలలో చాలా తక్కువ మొత్తంలో నీరు ఉండే ఎడారుల్లో స్యూ లెంట్స్, కాక్టస్ వంటి మొక్కలు మనగడను కొనసాగిస్తుంటాయి. అయితే ఈ మొక్కలకు పెద్దగా నీరు అవసరం ఉండదు. తక్కువ నీటితోనే ఇవి పెరుగుతుంటాయి.. అయితే ఈ నీటిని అవి సంపాదించుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటాయి. అవలంబిస్తుంటాయి కూడా. ఎడారిలో కురిసే వర్షం వల్ల ఒకేసారి నీటిని తమ వేర్ల ద్వారా సంగ్రహిస్తాయి. ఆ నీటిని చాలా కాలం పాటు నిల్వ ఉంచుకుంటాయి. పేర్లు, కాండాలు, పత్రాలలో అవి విలువ చేసుకుంటాయి.
అందువల్లే నట
హెర్బాసియన్ మొక్కల వేర్లు భూభాగంలో చాలా లోతు వరకు వెళ్తుంటాయి. ఆ వేర్ల ద్వారా అవి భూగర్భ జలాలను పీల్చుకుంటాయి.. ఒక అధ్యయన ప్రకారం వాటి వేర్లు చాలా మీటర్ల లోతులోకి వెళ్తాయి.. అక్కడ అవి నీటిని సంగ్రహిస్తాయి.. ఆ తర్వాత వెంటనే తమ ఆకులను రాల్చేసుకుంటాయి. దీనివల్ల చెట్ల ఆకుల నుంచి భాష్పీభవన ప్రక్రియ నిలిచిపోతుంది. దీంతో నీరు గాల్లోకి ఆవిరయ్యే శాతం పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా చెట్లలోనే నీరు అధికంగా నిల్వ ఉంటుంది. ఈ నీటి ద్వారా ఆ మొక్కలు మనుగడ కొనసాగిస్తాయి. జంతువులు, ఇతర వాటి నుంచి రక్షించుకోవడానికి ముళ్లు వంటి వాటిని ఉపయోగిస్తాయి. అందువల్లే జంతువులు ఈ మొక్కల జోలికి వెళ్ళవు. ఇక ఇటీవల కాలంలో ఎడారుల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. నీరు అధికంగా ఉండడంతో తమ పత్రాలను అవి రాల్చడం లేదు. ఫలితంగా ఎడారిలో కూడా పచ్చటి వాతావరణం కనిపిస్తోంది. మొరాకో, అల్జీరియా, సహారా ఎడారి విస్తరించిన ప్రాంతాలలో ఇటీవల కాలంలో వర్షాలు విపరీతంగా కురిశాయి. భారీగా వరదలు కూడా చోటుచేసుకున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడతో ఎడారిలో కూడా మొక్కలు మొలుస్తున్నాయి. తమ మనుగడ కొనసాగిస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఇటీవల కాలంలో ఎడారిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడంతో వరదనీరు భారీగా ప్రవహిస్తోంది.. అందువల్లే మొక్కలు కూడా విస్తారంగా పెరుగుతున్నాయి.