PM Kisan: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(PM kisan samman nidhi).. రైతులకు పెట్టుబడి కోసం కేంద్రం ఈ పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద ఐదు ఎకరాలలోపు సాగు భూమి ఉన్న రైతులకు కేంద్రం ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 18 విడతల్లో రైతులకు పెట్టుబడి సాయం అందించింది. 19వ విడత డబ్బులు ఫిబ్రవరి(February)లో చెల్లించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నేడాది కొత్తగా రైతులు ఈకేవైసీ చేయించుకోవాలని సూచించింది. జనవరి 31 వరకు ఈ కేవైసీ చేసుకున్న వారికే పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. పీఎం కిసాన్ నమోదుకు ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో ఈ ప్రక్రియ గ్రామస్థాయిలోని కొనసాగుతోంది. ఈ కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ నమోదు చేయించాలి. ఆ పత్రాలన్నీ ఉంటే ఇంట్లోనే ఈకేవైసీ చేసుకోవచ్చు. pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. కుడివైపు కనిపించే ఈకేవైసీపై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని సబ్‌మిట్ చేయగానే ఈకేవైసీ పూర్తవుతుంది.
సమీపిస్తున్న గడువు..
జనవరి 31 లోగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం తెలిపింది. అయితే ఈ నాలుగు రోజుల్లో పూర్తి చేయడం కష్టమే అని రైతులు అంటున్నారు. ఇప్పటికే సాంకేతిక సమస్యల కారణంగా ఈకేవైసీలో జాప్యం జరుగుతోంది. క్షేత్రస్థాయి పరిస్థితులు కేంద్రం నిర్దేశించిన లక్ష్యానికి దూరం చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేవైసీపూర్తి క ఆవాలంటే.. కేంద్రం డబ్బులు జమ చేసే బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్‌తో అనుసంధానమై ఉండాలి. ముందుగా రైతులు ఆధాన్ నంబర్, ఫోన్ నంబర్ అనుసంధానం చేయించాలి. ఈ కేవైసీ చేయించే క్రమంలో సంబంధిత ఫోన్ నంబర్‌కే ఓటీపీ వస్తుంది. అన్ని పత్రాలకు తోడు ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకుంటే ఈకేవైసీ పూర్తవుతుంది.
ఫోన్ నంబర్ సమస్య..
ఈకేవైసీ పూర్తి చేయడానికి ఫోన్ నంబర్ సమస్యగా మారుతోంది. చాలా మందికి పర్మినెంట్ ఫోన్ నంబర్ లేకపోవడంతో ఈకేవైసీ ఆలస్యం అవుతోంది. మీసేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్దకు వెల్లినవారు ఫోన్ నంబర్ సమస్యతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు ఉద్యోగం, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లినవారి ఈకేవైసీ కూడా పెండింగ్‌లో ఉంటుంది.