Czech Republic: ట్రెక్కింగ్ అనేది మనదేశంలో చాలా తక్కువ. కానీ ఇతర దేశాలలో మాత్రం ఇది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో ప్రజలు ఎక్కువగా ట్రెక్కింగ్ చేస్తుంటారు. గుట్టలు.. కొండలు ఎక్కుతూ.. సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. ఇలాంటి సమయంలో వారు తమ నైపుణ్యాలకు పదును పెట్టుకుంటూ.. ముందుకు వెళ్తుంటారు. ఇక విదేశాలలో కొన్ని ప్రాంతాలలో ట్రెక్కింగ్ నిర్వహించడానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఉంటాయి. ఆ ప్రాంతాలు టూరిస్ట్ హబ్ లు గా కూడా ఉంటాయి. పైగా యూరప్ దేశాలలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి..ట్రెక్కింగ్ ద్వారా శరీరంలో కాస్త వేడిని పెంచుకోవడానికి వెస్ట్రన్ కంట్రీస్ ప్రజలు ఇష్టపడుతుంటారు. ఇలా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఇద్దరు పర్యాటకులు సరదాగా ట్రెక్కింగ్ కు వెళ్లారు. అలా వెళ్ళిన వారికి ఊహించని సంఘటన ఎదురైంది.
Also Read: ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్లే పక్షులు ఏవో తెలుసా?
కళ్ళ ముందు కేజీఎఫ్
చెక్ రిపబ్లిక్ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఇద్దరు టూరిస్టులకు ఒకరకంగా కేజీఎఫ్ కనిపించింది.. ఊహించని విధంగా వారికి బంగారు నిధి లభించింది. ఇద్దరు పర్యాటకులు సరదాగా పోడ్కోర్కోనోసీ పర్వతాలపై హైకింగ్ వెళ్లారు. వారు అలా నడుచుకుంటూ పోతుండగా ఒకచోట బంగారు నిధి దర్శనమిచ్చింది. దానిని వారు తీసి చూస్తే 589 బంగారు నాణాలు, ఆభరణాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా వారు షాక్ కు గురయ్యారు. అసలు వారికి దొరికింది బంగారమేనా.. లేక కలలో ఉన్నారా.. అనుకుని తమను తాము గిచ్చి చూసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఆ బంగారు కాయిన్స్, ఆభరణాలను వారి వెంటనే ఈస్ట్ బొహెమియన్ మ్యూజియానికి అప్పగించారు. అయితే చెక్ రిపబ్లిక్ చట్టాల ప్రకారం ఎవరైనా ప్రజలకు అరుదైన వస్తువులు కనక దొరికితే వెంటనే వారు స్థానికంగా ఉన్న మ్యూజియం లేదా ప్రభుత్వానికి అప్పగిస్తే వాటి అసలు విలువలో 10 శాతం లభిస్తుంది. ఈ లెక్కన వారిద్దరికీ కూడా 10 శాతం సంపద లభించే అవకాశం ఉంది..” ఈ ప్రాంతాలలో గతంలో యుద్ధాలు జరిగాయి. కాకపోతే అవన్నీ ఇప్పుడు ఊరికి దూరంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడటం లేదు. ఇద్దరు పర్యాటకులు మాత్రం అక్కడికి వెళ్లి.. సరదాగా అక్కడి వాతావరణాన్ని చూడటం మొదలుపెట్టారు. అనుకోకుండా వారికి బంగారం లభించింది. ఒకరకంగా చెప్పాలంటే వారి పంట పండించింది. దీనివల్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి వారికి 10 శాతం సంపద లభిస్తుంది. వారికి దొరికిన సొమ్మును జేబులో వేసుకోకుండా.. ప్రభుత్వానికి తిరిగి తెచ్చి ఇవ్వడం అనేది గొప్ప విషయం. బహుశా అందువల్లే వారికి పది శాతం సొమ్ముతో పాటు.. అదనంగా ప్రభుత్వ గౌరవం కూడా లభించనుందని” చెక్ రిపబ్లిక్ మీడియా వ్యాఖ్యానిస్తోంది.