Gold Quality Doubts: బంగారానికి భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంటుంది. గోల్డ్ అనేది అత్యంత కాస్ట్లీ మెటల్. ఈ లోహాన్ని బయటకు తీసిన తర్వాత ఆభరణాల తయారీకి అనుకూలంగా మారుస్తారు. ఆ తర్వాత ఆభరణాలుగా మార్చేస్తారు. బంగారం నాణ్యతను బట్టి 24 క్యారెట్స్.. 22 క్యారెట్స్ లాగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత దానిని విక్రయిస్తూ ఉంటారు.. బిస్కెట్లు.. ఇతర
రూపాలలో బంగారాన్ని మారుస్తూ ఉంటారు.
ఓ నివేదిక ప్రకారం బంగారం ఈ భూమ్మీద లభించే అత్యంత ఖరీదైన లోహాలలో ఒకటి. బంగారానికంటే ఖరీదైన ప్లాటినం.. వజ్రాల వంటి లోహాలు అనేకం ఉన్నప్పటికీ.. బంగారాన్ని మాత్రమే భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అమెరికా నుంచి మొదలు పెడితే భారత్ వరకు బంగారానికి ఎప్పటికీ డిమాండ్ అధికంగానే ఉంటుంది. ఇక మన దేశంలో ఆడవాళ్లు బంగారాన్ని వివిధ రూపాలలో ధరించడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. అందువల్లే మన దేశంలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది.
బంగారం ఎప్పుడు చూసినా సరే మెరుస్తూ ఉంటుంది. దాని నాణ్యత ఆధారంగా మెరుపులు ఆధారపడి ఉంటాయి. అయితే బంగారం ఎందుకు ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.. ఇనుము మాదిరిగా అది కూడా ఒక లోహమే కదా అనే అనుమానం అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. గోల్డ్ ఎందుకు తుప్పు పట్టదు అనే కారణాన్ని తాజాగా శాస్త్రవేత్తలు విశ్లేషించారు. బంగారం ఉపరితలం మీద పరమాణువులు ఉంటాయి. ఇవి సహజంగా రక్షణ కవచం లాగా మారతాయి. ఆక్సిజన్ తో కలిసి ఇది రసాయన చర్య జరగకుండా అడ్డుకుంటాయి. అందువల్లే బంగారానికి తుప్పు అనేది పట్టదు. రెండు రకాల పరమాణువులు తమను తాను ప్రత్యేకమైన పద్ధతిలో అమర్చుకుంటాయి. దీనివల్ల బంగారం రంగు మారదు. అందువల్లే అది మెరుస్తూ ఉంటుంది.
బంగారంలో స్వచ్ఛత అధికంగా ఉంటాయి అది ఎప్పటికీ మన్నుతూనే ఉంటుంది. ఒకవేళ అందులో రాగి ఎక్కువ శాతం కలిస్తే దాని నాణ్యతలో తేడా వస్తూ ఉంటుంది. అందువల్లే బంగారంలో సాధ్యమైనంతవరకు మాత్రమే రాగి కలుపుతూ ఉంటారు. రాగి ఎక్కువగా కలిసిన బంగారు ఆభరణాలను ఇట్టే మనం గుర్తుపట్టవచ్చు.
View this post on Instagram
