Amazon : ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ షాపింగ్ కాలం. బిజీ షెడ్యూల్‌తో అందరూ అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. దీంతో కొంతమంది అక్రమార్కులు కూడా దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. డ్రగ్స్, గంజాయితోపాటు ఆయుధాల రవాణాకు కూడా దీనిని ఉపయోగించుకుని పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి అలాంటివి కాకుండా Xbox కంట్రోలర్‌ను ఆర్డర్ చేసిన ఓ జంటకు భయంకరమైన అనుభవం ఎదురైంది.
ఆర్డర్‌తోపాటు సర్పం..
ఈకామర్స్‌లో వచ్చే ఆర్డర్ల కొన్ని ఫేక్ అవుతుండడంతో చాలా మంది ప్యాకింగ్ ఓపెన్‌చేసే ముందు వీడియో తీస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ జంట చేసిన ఆర్డర్‌తో ఇంటికి వచ్చిన ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా అందులో నుంచి పాము బయటకు రావడంతో భయాందోళన చెందారు. ప్యాకింగ్‌కు ఉన్న టేప్ చుట్టకోవడంతో పాము బయటకు రాలేకపోయింది. లేదంటే వారిని కాటేసేదే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమెజాన్ నిర్లక్ష్యంతోనే…
అమెజాన్ కంపెనీ నిర్లక్ష్యంతోనే తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కస్టమర్ జంట ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ భద్రతా చర్యలను పాటించకుండా ఉండడంతోనే ఈ విధంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెజాన్ కూడా స్పందించి డబ్బులు రిఫండ్ చేశారని తెలిపారు. క్షమాపణలు కూడా తెలుపలేదని మండిపడ్డారు.
స్పందిస్తున్న నెటిజన్లు..
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్శిల్‌లో పాము మీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ రోజుల్లో ఆన్‌లైన్ డెలివరీలను నమ్మలేము.. కొద్ది రోజుల క్రితం డెలివరీ బాయ్ నాయ్ నాకు కాల్‌చేసి మీ ఇల్లు దూరంగా ఉంది కాబట్టి డెలివరీ చేయలేకపోతున్నాం.. ఆఫీస్‌కు వచ్చి ఆర్డర్ తీసుకోవాలి అని కోరాడు అని పేర్కొన్నాడు. అమెజాన్ ఇప్పుడు పాములను కూడా డెలివరీ చేస్తుందని, అందుకే ఆన్‌లైన్‌షాపింగ్‌లో అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. ఇంకో నెటిజన్ బ్రో దీనిని అమెజాన్ నుంచి కాదు.. అమెజాన్ అడవి నుంచి ఆర్డర్ చేశారేమో అని కామెంట్ చేశాడు.
A family ordered an Xbox controller on Amazon and ended up getting a live cobra in Sarjapur Road. Luckily, the venomous snake was stuck to the packaging tape. India is not for beginners
— Aaraynsh (@aaraynsh) June 18, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Cobra arrived in amazon order
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com