Cloud Formation Process: ప్రస్తుతం వర్షాకాలం.. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గడిచిన కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా భారీగా వర్షపాతం నమోదు అవుతున్నది. వర్షాలు కురుస్తున్నచోట ఆకాశంలో దట్టంగా మేఘాలు ఏర్పడుతున్నాయి. అవన్నీ కూడా నల్లగా ఉంటున్నాయి. నల్లటి మేఘాలు విస్తారంగా వర్షాలను కురిపిస్తున్నాయి. తద్వారా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతూ.. జలాశయాలు, వాగులు, వంకలకు నీటి కళను తీసుకొస్తున్నది. కొత్త నీటితో జలాశయాలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటున్నాయి.
Also Read: మహేష్ బాబు ‘హరి హర వీరమల్లు’ కథని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా!
వర్షాకాలంలో వర్షాలు కురవడం పెద్ద వింత కాకపోయినాప్పటికీ.. ఆకాశంలో నల్లగా దట్టమైన మేఘాలు ఏర్పడితే మాత్రం విపరీతంగా వర్షాలు కురుస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాలలో తెల్లటి, ఉదా రంగులో మేఘాలు ఏర్పడుతుంటాయి. అవి అంతగా వర్షాలను కురిపించవు. ఈ క్రమంలోనే నల్లటి మేఘాలు ఆ స్థాయిలో ఎందుకు వర్షాలను కురిపిస్తాయి అని అనుమానం అందరిలోనూ కలగవచ్చు. దీనికి కారణం లేకపోలేదు. సాధారణంగా సూర్యుడి వేడి వల్ల భూమి మీద ఉన్న నీరు ఆవిరి రూపంలో గాలిలోకి వెళ్తుంది. ఆ నీటి ఆవిరి చల్లబడిన తర్వాత.. చిన్నచిన్న నీటి బిందువులు లేదా మంచు స్పటికాలుగా ఘనీభవిస్తుంది. అవి మేఘాలుగా ఏర్పడతాయి. ఈ చిన్న చిన్న బిందువులు కలిసి పెద్దగా, బరువుగా మారినప్పుడు.. గురుత్వ ఆకర్షణ శక్తి వల్ల అవి వర్షిస్తాయి. ఇలా వర్షం కురిసే సమయంలో మేఘాలు నలుపు లేదా ముదురు రంగులో కనిపిస్తుంటాయి.
Also Read: దమ్ముంటే సినిమా తియ్యి’..అంబటి కి ‘హరి హర వీరమల్లు’ నిర్మాత సవాల్!
తెల్లటి మబ్బులలో నీటి బిందువులు అత్యంత తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇవి తక్కువ సాంద్రతతో సన్నగా ఉంటాయి. చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి. పైగా వీటినుంచి సూర్యరశ్మి కూడా అత్యంత సులభంగా ప్రవేశిస్తుంది. ప్రయాణిస్తుంది కూడా. అందువల్లే తెల్లటి మేఘాలు ఊహించిన స్థాయిలో వర్షాన్ని కురిపించలేదు. అయితే నల్ల మబ్బులు అలా కాదు.. వీటిల్లో అధిక సంఖ్యలో మంచు స్పటికాలు, నీటి బిందువులు ఉంటాయి. పైగా ఈ మేఘాలు భూమికి అత్యంత దగ్గరలో ఉంటాయి. వీటిలో అధిక సాంద్రత ఉంటుంది. అందువల్ల సూర్యరశ్మిని భూమి మీదకి చేరనివ్వవు. ఫలితంగా ఇవి నలుపు రంగులో కనిపిస్తుంటాయి. పైగా అత్యంత భారీ వర్షాన్ని కురిపిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో కుండ పోత, కుంభవృష్టి, మేఘ విస్పోటనం అనే స్థాయిలో వర్షాలు కురుస్తుంటాయి. దానికి మేఘాలలో ఉండే నీటి బిందువులు, మంచు స్పటికాలే కారణం..