AM Ratnam Interview: కొన్ని సినిమాలను స్టార్ హీరోలు యాదృచ్చికంగా మిస్ అవుతూ ఉంటారు. అలా కొన్ని మిస్ అయినా సినిమాలు కొంతమంది కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ గా నిలిచి వాళ్ళ స్టార్ స్టేటస్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తే, కొన్ని సినిమాలు మాత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ వదిలేసిన సినిమాలు అతడు, పోకిరి వంటివి మహేష్ బాబు చేసి భారీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని, సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. కానీ మహేష్ బాబు(Super Star Mahesh Babu) వదిలేసిన ఒక సినిమాని మాత్రం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేసి తన కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఆ సినిమా మరేదో కాదు, రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) ముందుగా ఈ కథని మహేష్ బాబు కి ‘ఖలేజా’ మూవీ టైం లో వినిపించాడట.
Also Read: దమ్ముంటే సినిమా తియ్యి’..అంబటి కి ‘హరి హర వీరమల్లు’ నిర్మాత సవాల్!
టైటిల్ శివుడు. అయితే ఈ సినిమా తియ్యడానికి చాలా బడ్జెట్ అవసరం అవుతుంది కదా, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి ఈ బడ్జెట్ తో సినిమా వర్కౌట్ అవ్వదు, భవిష్యత్తులో చేద్దామని మహేష్ బాబు అన్నాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ కొన్నాళ్ళు ఆగిపోయింది. ఆ తర్వాత చిన్నగా ఇది పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి చేరింది. పవన్ కళ్యాణ్ కి స్టోరీ చాలా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పి ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. కేవలం 80 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చెయ్యాలి అనేది ప్లాన్. అనుకున్న ప్లాన్ ప్రకారం చకచకా సినిమాని మొదలు పెట్టి పూర్తి చేసే దిశగా అడుగులు వేశారు. 50 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. కానీ ఇంతలోపే కరోనాలు రావడం, పవన్ కళ్యాణ్ వేరే సినిమాలకు షిఫ్ట్ అవ్వడం, డైరెక్టర్ క్రిష్ పవన్ కోసం ఎదురు చూసి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం వంటివి జరిగాయి.
Also Read: ‘నీ అబ్బా’ అంటూ యాంకర్ ప్రదీప్ పై రెచ్చిపోయిన నిహారిక కొణిదెల!
రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం లో క్రిష్ దర్శకత్వం వహించిన ప్రతీ సన్నివేశం చూసేందుకు ఎంతో బాగా అనిపించింది. చాలా ఆసక్తికరంగా కూడా ఉన్నింది. కానీ ఆయన తప్పుకున్న తర్వాత జ్యోతి కృష్ణ ఎంట్రీ ఇచ్చి, ఆయన తీసిన సన్నివేశాలు మాత్రం తేలిపోయాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ గురించి అభిమానులే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక సినిమాలో గ్రాఫిక్స్ ఎంత చెత్తగా ఉండకూడదో, ఈ చిత్రాన్ని చూసి నేర్చుకోవచ్చని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గ్రాఫిక్స్ వర్క్ సమయానికి పూర్తి కాకపోవడం వల్లే, రఫ్ కాపీ ని వదలాల్సి వచ్చిందని నిర్మాత AM రత్నం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మరోవైపు సోషల్ మీడియా లో ఈ చిత్రంలోని గ్రాఫిక్స్ పై ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి.