spot_img
Homeవింతలు-విశేషాలుMan Earns Money Listening To Problems: చిన్న బాధలకు 250.. పెద్ద బాధలకు 500.....

Man Earns Money Listening To Problems: చిన్న బాధలకు 250.. పెద్ద బాధలకు 500.. ఏడిస్తే 1000 రూపాయలు.. ఇది వ్యాపారం భయ్యా..

Man Earns Money Listening To Problems: ప్రపంచం మారిపోయింది. సాటి మనిషితో మరొక మనిషి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఫోన్లో గడపడం ఎక్కువైపోయింది. అక్కడిదాకా ఎందుకు? ఎదుటి మనిషికి సంబంధించిన బాధను పంచుకోవడం కనుమరుగైపోయింది. అతడు దుఃఖంలో ఉంటే ఓదార్చడం నా మోసి అయిపోయింది. అందువల్లే మనుషుల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. మాట్లాడే మనిషి లేకపోవడంతో.. బాధను పంచుకునే అవకాశం లేకపోవడంతో వారిలో వారే కుమిలిపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కుంగిపోతున్నారు.

Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..

ఆ ఆలోచన అతడికి ఎలా వచ్చిందో తెలియదు. ఎందుకు వచ్చిందో తెలియదు.. కాకపోతే ఎదుటి మనిషి బాధను పంచుకోడాన్ని.. దుఃఖంలో ఓదార్చడాన్ని అతడు వ్యాపారంగా మార్చుకున్నాడు. అంతే మరో మాటకు తావు లేకుండా దుకాణం పెట్టేసాడు. ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు..”నేను మనిషిని.. నాకు మనుషులు అంటే చాలా ఇష్టం. వారి బాధలు వినడం.. వారు దుఃఖంలో ఉంటే ఓదార్చడం మనిషిగా నా బాధ్యత. వారి కుటుంబ సభ్యుడిగా ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి.. నాకు ఎంతో కొంత ప్రయోజనం పెట్టాలి కదా. అందుకే చిన్న బాధకు 250.. పెద్ద బాధకు 500.. దుఃఖానికి 1000 రూపాయలు తీసుకుంటున్నారని” అతడు ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నాడు.

మొదట్లో అతడిని పిచ్చివాడిగా చూశారు. ఆ తర్వాత అతడు అలా చేయడంలో తప్పులేదని భావించారు. ఇంకేముంది జనాలు ప్రతిరోజు అతని వద్దకు రావడం మొదలుపెట్టారు. భర్త లేని భార్య.. భార్యను దూరం చేసుకున్న భర్త.. పెళ్ళాంతో వేగలేని యువకుడు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడు పెడుతున్న కష్టాలు తట్టుకోలేని భార్య.. ఇలా ప్రతి ఒక్కరూ అతని వద్దకు రావడం మొదలుపెట్టారు. తమ బాధలను అతడితో చెప్పుకోవడం ప్రారంభించారు. కొందరైతే బాధను తట్టుకోలేక ఏడవడం కూడా మొదలుపెట్టారు. ఇలా అందరి బాధలను అతడు వింటూ.. ప్రతిరోజు 3 నుంచి 5000 వరకు సంపాదిస్తున్నాడు. పైసా పెట్టుబడి లేకుండా ప్రతిరోజు లాభాలను కళ్ళజూస్తున్నాడు.

ఎవరిని మోసం చేయకుండా.. మాయమాటలు చెప్పకుండా.. మనుషుల బాధలు వింటూ.. వాళ్ల కన్నీళ్లను తుడుస్తూ అతడు సంపాదిస్తున్న తీరు మిగతా వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదట్లో అతడు దిగువ మధ్యతరగతి జీవితాన్ని గడిపేవాడు. ఎప్పుడైతే తన వ్యాపారం క్లిక్ అయిందో.. అతని ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా లక్షాధికారిగా మారిపోయాడు.

సాటి మనిషితో మాట్లాడాలి. అతనితో ఆత్మీయ సంభాషణ జరపాలి. కష్టాలను వినాలి. కన్నీళ్లను తుడవాలి. దుఃఖంలో ఉండే దగ్గరికి తీసుకోవాలి. ఇన్ని చేసిన తర్వాత దానికి చార్జ్ చేయడంలో తప్పులేదు. ఇతడు చేస్తున్న దాంట్లో కూడా ఏ మాత్రం తప్పులేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version