Homeక్రీడలుక్రికెట్‌ICC ODI World Cup 2027: ఈసారి వన్డే వరల్డ్ కప్ మామూలుగా ఉండదు.. ఐసీసీ...

ICC ODI World Cup 2027: ఈసారి వన్డే వరల్డ్ కప్ మామూలుగా ఉండదు.. ఐసీసీ ఫార్మాట్ అంచనాలకు మించి..

ICC ODI World Cup 2027: మామూలుగా అయితే ఐసీసీ నిర్వహించే టోర్నీలు ఒక విధంగా సాగుతూ ఉంటాయి. మెగా టోర్నీలు ఒక క్రమ పద్ధతి ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. కానీ ఈసారి వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి ఐసీసీ అమలు చేస్తున్న నిబంధనలు అంతకుమించి అనే విధంగా ఉన్నాయి. క్రికెట్ చూసే ప్రేక్షకులకు ఆనందం.. ఆడే ప్లేయర్లకు ఉత్కంఠ కలిగించే లాగా నిబంధనలు పూర్తిగా మార్చింది ఐసీసీ.

2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ ను ఐసీసీ ఈసారి మూడు రౌండ్లుగా మార్చింది. ఈ మూడు రౌండ్లలో తొలి రౌండు లో 14 జట్లలో చివరి మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ సిరీస్ ఉంటుంది. ఒక జట్టు రౌండ్ 2 కు వెళ్తుంది. రౌండ్ 2 లో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు. ఒక్కో గ్రూపులో ఉన్న ఆరు జట్లు.. మిగతా అన్ని జట్లతో పోటీ పడతాయి..టాప్ 3 తో పాటు రెండు గ్రూపుల్లోని నాలుగవ బెస్ట్ టీం సూపర్ 7 కు చేరుకుంటుంది. రౌండ్ 3 లో 21 మ్యాచ్లు జరుగుతాయి. సూపర్ సెవెన్ లో ఒక్కో జట్టు మిగతా జట్లతో పోటీపడుతుంది. టాప్ 4 జట్లు సెమీస్ వెళ్ళిపోతాయి.

వరల్డ్ కప్ లో ఈసారి ఇలా నిబంధనలు మార్చడం వెనక బలమైన కారణం ఉంది. ఎందుకంటే క్రికెట్ కు మరింత ఆదరణ దక్కే విధంగా చేయడానికి ఐసీసీ ఈ నిబంధనలు రూపొందించింది. వన్డే వరల్డ్ కప్ లో అగ్రశ్రేణి జట్లు మాత్రమే అదరగొడుతున్నాయి. అయితే 2024 t20 వరల్డ్ కప్ మాదిరిగా.. సాధారణ జట్లు కూడా వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా ఆడాలని ఐసీసీ నిర్ణయం. అందువల్ల ఇలాంటి విధానాలను రూపొందించింది. ఆటగాళ్ల అభిప్రాయాలు… మాజీ ప్లేయర్ల అభిప్రాయాలు.. అభిమానుల అభిప్రాయాలు తీసుకొని ఈ విధానాలకు శ్రీకారం చుట్టింది. ఈ విధానాల ద్వారా క్రికెట్ చూసే వారి సంఖ్య పెరుగుతుందని.. సాధారణ జట్లు కూడా అద్భుతమైన ప్రతిభ చూపటానికి ఆస్కారం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరుగుతోంది. చాలా వరకు దేశాలు క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఐసీసీ కూడా క్రికెట్ అభివృద్ధి కోసం భారీగా ఖర్చు పెడుతుంది. అందువల్లే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విషయంలో ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల వల్ల ఆటగాళ్లలో పోటీ తత్వం.. చూసే అభిమానులకు క్రికెట్ ఆనందం లభిస్తుందని ఐసిసి అంచనా వేస్తోంది. ప్రైజ్ మనీ విషయంలో కూడా పెంపు విషయాన్ని ఐసిసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్రైజ్ మనీ పెంపు జరిగితే క్రికెట్ కు మరిన్ని మంచి రోజులు వచ్చినట్టే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version