Mariet Thomas: ఏదైనా సాధించాలి? పొందాలి? ఎదగాలి అని చెబితే చాలా మంది సాకులు చెబుతుంటారు. మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి. లేదా నాకు చెప్పే వారు లేరు. డబ్బు సమస్య. ఇలా ఏదో ఒక సాకు చెబుతూ పట్టించుకోరు. కెరీర్ పట్ల నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తారు. మరి మీరు కూడా ఇలాంటి సాకులే చెబుతుంటారు. కానీ ఎంత పెద్ద కష్టాన్ని అయినా కొందరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. వారు కచ్చితంగా సక్సెస్ ను సాధిస్తారు. అందుకు బెస్ట్ ఉదాహరణను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శరీరంలోని ప్రతి భాగం మనషులకు ముఖ్యమైన భాగమే. కళ్లు, కాళ్లు, ముక్కు, చేతులు, కాలేయం ఇలా ఏ అవయవం లేకపోయినా కూడా చాలా ఇబ్బంది పడాల్సిందే. కొన్నిసార్లు ఒక భాగం వల్ల ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంటుంది. అయితే కొందరు శరీరంలో ఏదో ఒక భాగాన్ని కోల్పోతారు. అయినా కూడా స్ఫూర్తితో జీవితాన్ని ముందుకు సాగిస్తుంటారు. ముందు లాగానే తమ జీవితం ఉండాలని కృషి, పట్టుదలతో తమ లైఫ్ ను లీడ్ చేయాలి అనుకుంటారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మాయి అచ్చం అదే కోవకు చెందినది. ఈ యువతికి రెండు చేతులు కూడా లేవు. కానీ తనను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె పేరు జిలుమోల్ మారియెట్ థామస్. కేరళలో ఉంటుంది. ఈమెకు చేతులు లేకపోయినా కూడా కారును ఈజీగా నడుపుతుంది.దీని కోసం ఆమె చేతులను కాకుండా పాదాలను ఉపయోగిస్తుంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమెకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. కారు నడపడానికి వీలుగా ప్రభుత్వం అందించే డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా సొంతం చేసుకుంది.
ఇవన్నీ కూడా మారియట్ కి చెందిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో యువతి పాదాలతో కారు నడుపుతూ అందరిని షాక్ కు గురిచేస్తుంది. ఇలా కాళ్లను ఉపయోగించి కారు నడపడం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు చిన్న చిన్న వాటికి సాకులు చెప్పే వారు వీరిని చూసి నేర్చుకోవాల్సిందే కదా..
View this post on Instagram