Snake : రెండు తలల పాముతో సిరిసంపదలు పెరుగుతాయా?

అధికారుల సైతం ఈ పాము రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వీటి సమాచారం అందించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవి హానికరం కాదని.. ఈ పాములను చంపవద్దని సూచిస్తున్నారు. మనదేశంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు.

Written By: NARESH, Updated On : April 29, 2024 10:37 am
Follow us on

Snake : సాధారణంగా పాము అంటేనే భయపడతాం. కనిపిస్తే అల్లంత దూరం వెళ్లిపోతాం. అట్లాంటిది ఓ పాము ఎక్కడ దొరుకుతుందా? అని అదే పనిగా కొందరు వెతుకుతుంటారు. దొరికిన వాటిని లక్షలు, కోట్లకు అమ్ముతున్నారు. అయితే ఆ పాము అంత విలువైనదా? అంత ఆదాయం పెడుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పాము చుట్టూ ఉన్న ప్రచారం ఎనలేని ప్రాధాన్యత పెంచింది. ఇంతకీ ఆ పాముకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటా రా? రెండు తలలు ఉండడమే ఆ పాము చేసుకున్న అదృష్టం. రెండు తలలతో ఉన్న పాము ఇంట్లో ఉంటే సిరిసంపదలు కలుగుతాయి అన్న నమ్మకం ప్రజల్లో పెరగడంతో.. వాటికి డిమాండ్ ఏర్పడింది.

విదేశాల్లో అయితే ఈ రెండు తలలు ఉన్న పాము కు చాలా డిమాండ్. ఈ పాము మాంసం లైంగిక శక్తిని పెంచుతుందని కొన్ని దేశాల ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా చైనా, హాంకాంగ్ లో అయితే వంటల్లో కూడా ఈ పామును వేస్తారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటితో క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులు నయం అవుతాయని కూడా ఒక ప్రచారం ఉంది. ఈ పామును రెండో సాండ్ బోవోగా పిలుస్తారు. ఈ పాములు ఎక్కువగా భారత్, పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లో కనిపిస్తాయి. ఇవి పూర్తిగా విషరహితం అయినవి. కనీసం కాటు కూడా వేయవు. రెండు మీటర్ల నుంచి మూడు మీటర్ల వరకు పెరుగుతాయి. రాతి, ఇసుక నేలల బొరియల్లో నివసిస్తాయి.

వాస్తవానికి ఈ పాముకు రెండు తలలు ఉండవు. తోక కూడా తలలా ఉండడమే దీని ప్రత్యేకత. ఏదైనా ఆపద వచ్చినప్పుడు తన తోకను నోరులా పైకి లేపగలదు. అందుకే అందరూ దీనిని రెండు తలల పాముగా భావిస్తారు. ఈ జాతికి చెందిన ఆడ పాము 14 పిల్లల వరకు జన్మనిస్తుంది. కీటకాలు, బల్లులు, చుంచులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటాయి.

అయితే ఈ రెండు తలల పామును ఇంట్లో పెట్టుకుంటే సిరిసంపదలు కలుగుతాయని కొందరు ప్రచారం చేస్తుంటారు. అయితే అదంతా ఫేక్ అని నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా లక్ కలిసి రావడం అనేది కేవలం ప్రచారం మాత్రమే. అధికారుల సైతం ఈ పాము రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా కనిపిస్తే వీటి సమాచారం అందించేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ను సైతం అందుబాటులోకి తెచ్చారు. ఇవి హానికరం కాదని.. ఈ పాములను చంపవద్దని సూచిస్తున్నారు. మనదేశంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు.