https://oktelugu.com/

Priyanka Jain: పెళ్ళికి ముందే గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ప్రియాంక… ఓ కోరిక తీరబోతుందట!

తాజాగా ఫ్యాన్స్ ని ఖుషి చేసే గుడ్ న్యూస్ ఒకటి చెప్పారు. దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విషయం ఏంటంటే .. ప్రియాంక - శివ్ కుమార్ తమ పెళ్లికి ముందే ఓ సొంత ఇల్లు...

Written By:
  • S Reddy
  • , Updated On : April 29, 2024 / 10:37 AM IST

    Priyanka Jain, Shiva Kumar, Bigg Boss 7 Telugu, Telugu News

    Follow us on

    Priyanka Jain: బిగ్ బాస్ సీజన్ 7 లో పార్టిసిపేట్ చేసి క్రేజ్ రాబట్టింది ప్రియాంక జైన్. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో సత్తా చాటింది. ఫినాలేకు చేరుకొని టాప్ 5 లో నిలిచింది. హౌస్ లో ఉన్నప్పుడు తన ప్రేమ విషయం బయటపెట్టింది. ప్రియుడు శివ్ కుమార్ ని పరిచయం చేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. చాలా కాలంగా ప్రియాంక, శివ్ కుమార్ సహజీవనం చేస్తున్నారు. ఈ ఏడాది తప్పకుండా పెళ్లి చేసుకుంటామని ఈ జంట పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్నారు.

    ఈ నేపథ్యంలో తాజాగా ఫ్యాన్స్ ని ఖుషి చేసే గుడ్ న్యూస్ ఒకటి చెప్పారు. దీంతో నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విషయం ఏంటంటే .. ప్రియాంక – శివ్ కుమార్ తమ పెళ్లికి ముందే ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇటీవల ఓ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ చూశారట. అది బాగా నచ్చడంతో తీసుకుందాం అని కూడా అనుకున్నారట. అంతా ఫైనల్ అవుతున్న సమయంలో వారికి మరో ఆలోచన వచ్చిందట.

    అంత అమౌంట్ పెట్టి ఫ్లాట్ తీసుకోవడం కంటే ఓ మంచి ల్యాండ్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నారట. పైగా అపార్ట్మెంట్ లో అంత ఫ్రీడమ్ ఉందని అన్ని విధాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో శివ్ – ప్రియాంక హైదరాబద్ లో ఓ స్థలం కొనుగోలు చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని తాజాగా ఈ జంట తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకొచ్చారు.

    కాగా ప్రియాంక జైన్ – శివ్ కుమార్ మౌనరాగం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో జంటగా నటించిన వారు ప్రేమలో పడ్డారు. కోనేళ్ళుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక సీరియల్స్ లో నటించడం లేదు. ప్రియుడితో కలిసి గోవా, బెంగళూరు, ఢిల్లీ అంటూ వెకేషన్స్ కి చెక్కేస్తోంది. ఇక ప్రియాంక- శివ్ కుమార్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.