Camel Tear: ఎడారి ఓడగా ఒంటె ప్రసిద్ధి చెందింది. మనదేశంలో ఎడారి ప్రాంతాలలో ఒంటెలు విపరీతంగా ఉంటాయి. ఒంటెల మీద ఆధారపడి అక్కడి ప్రజలు జీవిస్తుంటారు. ఒంటె పాలను వాడుకుంటారు. ఒంటెల పెంటలను పంట పొలాలకు ఎరువులుగా వాడుతారు. ప్రయాణ సాధనాలుగా ఒంటెలను ఉపయోగిస్తారు. ఒంటెలు ఎక్కువగా నీటిని తాగవు. నీటిని చాలావరకు తమ శరీరంలో పొదుపు చేసుకొంటాయి. ఎంత ఎండ కొట్టినా సరే నీరసించి పోవు. పైగా ఆహారాన్ని కూడా ఒకేసారి భారీగా తీసుకుంటాయి. అందువల్ల అవి ఎడారి ప్రాంతంలో నివసిస్తుంటాయి..
ఒంటెల శరీరం అత్యంత దృఢంగా ఉంటుంది. వీటి మాంసానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పండగ దినాలలో వీటిని వధిస్తూ ఉంటారు. ఒంటెల పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్లు శరీర వృద్ధికి సహకరిస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఒంటె పాలు ఎంతో మేలు చేస్తుంటాయి.. గర్భిణుల కు వచ్చే సాంక్రమిక వ్యాధులను ఒంటె పాలు దూరం చేస్తాయి. ఒంటె పాలు, పెంటలు, మాంసం మాత్రమే కాదు.. ఒంటె కన్నీళ్లు కూడా ఎంతో విలువైనవి. ఎంతో శక్తివంతమైనవి.
Also Read: ఆ స్టార్ హీరో కి ఉన్నట్టు నాకు బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేదు..అందుకే ఫ్లాపులు – విజయ్ దేవరకొండ
ఒంటెలను ఎడారి ప్రాంతాలలో విపరీతంగా పెంచుతుంటారు. అక్కడి వాతావరణం లో ఇవి అత్యంత త్వరగా పెరుగుతూ ఉంటాయి. వీటికి ఎటువంటి వ్యాధులు దరి చేరవు.. ఎంతటి బరువనైనా ఇవి మోస్తాయి. పర్యాటకులు ఒంటెల మీద సవారి చేయడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎడారి రాష్ట్రాలలో ఒంటెలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి పాలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. వీటి పాలకు విదేశాలలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. మాంసాన్ని ఇతర దేశాల చెందిన ప్రజలు ఎక్కువగా తింటుంటారు. అందువల్లే ఎడారి ప్రాంతాల రైతులు వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసి వీటిని సాకుతుంటారు. దాణా, నీళ్లను ఒంటెలు ఎక్కువగా తీసుకుంటాయి. అయితే నీటిని మూపురం ప్రాంతంలో చేసుకుంటాయి. నీరు దొరకనప్పుడు మూపురం ప్రాంతంలో నిర్వర్తిస్తున్న నీటిని శరీర జీవ క్రియల కోసం ఉపయోగించుకుంటాయి.
ఒంటె కన్నీటి చుక్క 26 పాముల విషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లో ఉన్న నేషనల్ రిఫెరల్ సెంటర్ ఆన్ క్యామల్స్ నిర్వహించిన అధ్యాయంలో వెళ్లడైంది. ఒంటెలకు సా స్కేల్డ్ వైపర్ అనే పాము విషం తో శాస్త్రవేత్తలు ఇంజక్షన్ రూపంలో రోగనిరోధక శక్తిని అందించారు. ఒంటెల కన్నీళ్లు, రక్తంలో ఉన్న ప్రతిరోధకాలు ఆ విషం ప్రభావాన్ని తొలగించాయి.. దీంతో ఒంటెల ఒక్క కన్నీటి చుక్క 26 పాము విషాలకు విరుగుడుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒంటె యాంటి బాడీలకు డిమాండ్ పెరగనుంది. మనదేశంలో ప్రఖ్యాతి చెందిన వివిధ ఫార్మా కంపెనీలు కూడా ఒంటె యాంటీ బాడీలను విపరీతంగా స్టోరేజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి..