Vijay Devarakonda : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ సపోర్టు తో వచ్చే హీరోలకు, బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చే హీరోలకు చాలా తేడా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న పోటీ వాతావరణం లో అయితే బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నెగ్గుకురావడం అసాధ్యమైన పని. అయినప్పటికీ విజయ్ దేవర కొండ(Vijay Devarakonda), నాని(Natural Star Nani), శ్రీ విష్ణు(Sree Vishnu) వంటి హీరోలు ఇండస్ట్రీ లో విజయాలను అందుకొని యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. విజయ్ దేవరకొండ అయితే కేవలం రెండు సినిమాలతోనే యూత్ ఆడియన్స్ లో స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే చాలా కాలం నుండి ఆయనకు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తగులుతున్నాయి. రీసెంట్ గా ఆయన గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) తో ‘కింగ్డమ్'(Kingdom Movie) అనే చిత్రం చేశాడు.
షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రొమోషన్స్ లో భాగంగా ఇంటర్వూస్ ని మొదలు పెట్టాడు. ఒక ఇంటర్వ్యూ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒక పేరున్న డైరెక్టర్ నాకు కథ చెప్పడానికి వస్తే ,నాకు ఆ కథ నచ్చలేదు ,స్క్రిప్ట్ లో చాలా లోపాలు ఉన్నాయి అని చెప్పే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే నాకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేదు,ఎప్పుడైనా నన్ను తొక్కేయొచ్చు అనే భయం ఉంటుంది. అదే స్టార్ హీరో వారసుడు నాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతని సినిమా కి ఒకసారి స్టోరీ లో లోపాలుంటే పది మంది రైటర్స్ కూర్చొని అతని కోసం పని చేశారు. నాకు అంత స్వేచ్ఛ ఇప్పటికీ లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
https://x.com/Movies4u_Officl/status/1942437463823204789
ఇంతకు విజయ్ దేవరకొండ ఏ హీరో ని ఉద్దేశించి కామెంట్స్ చేశాడు అంటూ సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది. రామ్ చరణ్ అభిమానులు ఇది అల్లు అరవింద్ ని ఉద్దేశించి అన్నవని చెప్పుకొస్తున్నారు. మరో పక్క అల్లు అర్జున్ అభిమానులు ఇది రామ్ చరణ్ ని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అంటూ చెప్పుకొచ్చారు. అలా వీళ్ళ మధ్య సోషల్ మీడియా లో ప్రస్తుతం పెద్ద యుద్ధమే కనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ పై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా అది బాగా వైరల్ అయిపోతున్నాయి. ఈ చిత్రం పై విజయ్ దేవరకొండ చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఆయన ఈ చిత్రం తో భారీ హిట్ ని అందుకుంటాడా లేదా అనేది చూడాలి.