Brokpa Tribe: విదేశాల నుంచి వస్తారు.. గర్భవతులుగా వెళ్తారు.. మనదేశంలో ఆ గ్రామ యువకులపై అంత మోజు మరి..

ప్రపంచంలో ఏ దేశానికీ లేని పురాతన నాగరికత భారతదేశం సొంతం. ఘనమైన సాంస్కృతిక వైభవం, చారిత్రాకమైన ప్రదేశాలు, విస్తారమైన నగరాలు, సమష్టి జీవన తత్వానికి అద్దం పట్టే గ్రామాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశం గొప్పతనం వర్ణనకు అందదు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 9:56 am

Brokpa Tribe

Follow us on

Brokpa Tribe: ఎన్నో విశిష్టతలు ఉన్న మన దేశాన్ని సందర్శించేందుకు ప్రతి ఏడాది విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు.. మన దేశంలో సహజ సిద్ధమైన అందాలకు నెలవైన గ్రామాలలో లడఖ్ ఒకటి. ఈ గ్రామం హిమాలయాలకు దగ్గరగా ఉంటుంది. అద్భుతమైన సరస్సులు, తులిప్ పుష్పాలు, పచ్చిక బయళ్లు ఇక్కడ దర్శనమిస్తుంటాయి. ఇది మాత్రమే కాకుండా అందమైన ఆజానుబాహుల్లాంటి మగాళ్లు కూడా ఉంటారు. వారికోసం ఇక్కడ యూరప్ నుంచి యువతులు కూడా వస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు.. అందమైన ఆజానుబాహుల్లాంటి పిల్లలకు జన్మనివ్వాలని ఆ మహిళలు ఇక్కడికి ప్రయాణం సాగిస్తుంటారు. ఇది చదవడానికి కొంచెం వింతగా ఉన్నప్పటికీ.. ఇది ముమ్మాటికి నిజం.. దీనికి వారు ” గర్భం దాల్చే పర్యాటకం” అని పిలుస్తుంటారు.

వ్యాపారంగా మారింది

లడఖ్ చుట్టుపక్కల గ్రామాలలో ” గర్భం దాల్చే పర్యాటకం” ఒక వ్యాపారంగా మారింది. 2000 సంవత్సరం నుంచి ఇది మొదలైందని ఇక్కడి ప్రజలు చెబుతుంటారు. లడఖ్ సుప్రసిద్ధ కార్గిల్ సెక్టార్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామాన్ని ఆర్య వ్యాలి అని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో “బ్రోక్పా” తెగకు చెందిన వారు నివాసం ఉంటారు. వీరి పూర్వీకులు అలెగ్జాండర్ సైన్యంలో పనిచేసిన వారు. అలెగ్జాండర్ భారత్ ను వదిలిపెట్టినప్పుడు.. తడి సైన్యంలో పనిచేసిన కొంతమంది ఇక్కడే ఉన్నారు. అలా వారి సంతతి ఇక్కడ పెరిగింది. అయితే వీరంతా ఆరడుగుల ఎత్తు, తెలుపు + గోధుమరంగుల మిశ్రమంతో కూడిన వర్ణం, బలమైన దేహం, అద్భుతమైన రోగనిరోధక శక్తి, ఒత్తయిన వెంట్రుకలతో అందంగా కనిపిస్తారు. నీలిరంగు కళ్ళతో అద్భుతంగా దర్శనం ఇస్తారు. వీరంతా ఆర్యుల జాతికి చెందిన వారని యూరోపియన్ మహిళలు నమ్ముతుంటారు. అందు గురించే వారు ఇక్కడికి విపరీతంగా వస్తూ ఉంటారు..

శృంగారంలో పాల్గొంటారు

“బ్రోక్పా” జాతికి చెందిన వారితో యూరోపియన్ దేశాలకు చెందిన మహిళలు ఎక్కువగా శృంగారంలో పాల్గొంటారు. ఇలా పాల్గొన్నందుకు “బ్రోక్పా” జాతికి చెందిన వారికి డబ్బులు కూడా చెల్లిస్తుంటారు. గర్భం దాల్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తుంటారు.. తన పిల్లలకు నాన్న ఉన్నా, లేకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతారు. తమ పిల్లలు అందంగా ఉండాలని కోరుకుంటారు.. ఆజాను బహులలాగా ఎదగాలని విశ్వసిస్తారు. అందు గురించే ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో “గర్భం దాల్చే పర్యాటకం” పెరగడానికి ప్రధాన కారణం అదే. దీనిపై దేవేంద్ర కుమార్ షైనీ అనే ఒక వ్యక్తి ట్విట్టర్లో ఒక పోస్ట్ ద్వారా సుదీర్ఘంగా వివరించాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతమైన వ్యాప్తిలో ఉంది.