https://oktelugu.com/

Viral Video: నెమలిపై దాడి చేయబోయింది.. కానీ అంతలోనే జరిగిన అద్భుతంతో పులి బిత్తర పోయింది..

నెమలి పురివిప్పి ఆడుతుంటే.. చూసేందుకు ఆ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఓ నెమలి తన పిల్లలతో అడవిలో సంచరిస్తోంది. ఈ లోగానే ఓ పులి అటువైపు వచ్చింది. నెమలిని అమాంతం తినడానికి ప్రయత్నించింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 29, 2024 / 09:34 AM IST

    Viral Video(1)

    Follow us on

    Viral Video: సాధారణంగానే నెమలి చాలా చురుకుగా ఉంటుంది. దాని పదునైన ముక్కుతో ఎంతటి జంతువు పైనైనా దాడి చేయగలుగుతుంది. అయితే ఒక్కోసారి నెమలి ఆద మరచి ఉంటే ప్రత్యర్థి జంతువు వెంటనే దాడి చేస్తుంది. అలాంటి సమయంలో నెమలి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొక తప్పదు. ఇన్ స్టా లో విస్తృతమైన వ్యాప్తిలో ఉన్న వీడియోలో కూడా ఓ నెమలి అలానే ఆదమరిచి ఉంది. దాని పక్కనే పిల్లలు కూడా ఉన్నాయి. ఇంతలోనే ఒక పులి వచ్చింది. ఆ నెమలిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఈ లోగానే ఆ నెమలి అప్రమత్తమయింది. దాని పిల్లలు కూడా వేగంగా స్పందించాయి. ఫలితంగా ఆ పులి నోటి కాడికి అందిన ఆహారం దూరమైంది.. పులి అకస్మాత్తుగా రావడంతో ఆ ప్రాంతంలో మేతమేస్తున్న నెమలి వెంటనే అప్రమత్తమయింది. తన రెక్కల సహాయంతో గాల్లోకి రివ్వుమంటూ ఎగిరింది. దాని పిల్లలు కూడా అదే వేగంతో కొమ్ముల పైకి కూర్చున్నాయి. దీంతో ఆ పులి నిరాశతో వెనుదిరిగింది.

    సోషల్ మీడియాలో..

    ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని.. ఓ ఔత్సాహికుడు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో తీసి ఇన్ స్టా లో అప్లోడ్ చేశాడు. చూసేందుకు అద్భుతంగా ఉన్న ఈ వీడియో ఇప్పటివరకు లక్షలాది వీక్షణలను సొంతం చేసుకుంది. ” పులి తెలివైన జంతువు అనుకుంటాం. కానీ ఒక్కోసారి అది కూడా బోల్తా పడుతుంది. దానిని ఈ వీడియో నిరూపించింది.. కాసేపు అలానే నెమలి ఆదమర్చి ఉంటే పులికి ఆహారమయ్యేదే. కానీ ఈ లోగానే నెమలి అప్రమత్తమైంది. వెంటనే తేరుకొని చెట్టు మీదికి ఎక్కింది. దాని పిల్లలు కూడా తల్లిని అనుసరించాయి. అందుకే అంటారు అపాయంలో ఉపాయం అనేది ప్రాణాలు కాపాడుతుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

    అద్భుతంగా ఉన్నాయి

    ఇన్ స్టా లో తెగ చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఆ అడవి కూడా సుందరంగా కనిపిస్తోంది. చెట్టుమీదకు ఎక్కి కూర్చున్న నెమలి పించాలు వర్ణ రంజితంగా కనిపిస్తున్నాయి.. చెట్టు మీదికి ఎక్కిన తర్వాత ఆ నెమలి అదే పనిగా కూతలు పెట్టడం ప్రారంభించింది. దాని పిల్లలు కూడా అదే స్థాయిలో శబ్దాలు చేశాయి. అంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం, మీరు క్షేమంగా ఉన్నారా? అంటూ తల్లి నెమలి సంకేతాలు ఇస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ఆ తర్వాత ఆ నెమలి, దాని పిల్లలు ఒకే కొమ్మ పైకి చేరాయి. ఆ తర్వాత తల్లి ఒడిలో ఆ పిల్లలు వెచ్చగా సేద తీరాయి.