India T20 World Cup 2026 : టి20 వరల్డ్ కప్ లో ప్రస్తుతం ఆడుతున్న జట్లలో టైటిల్ ఫేవరెట్ గా ఉన్న వాటిల్లో ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉంటుంది. ఆస్ట్రేలియా జట్టులో అత్యంత సమర్థవంతమైన ప్లేయర్ లు ఉన్నారు. వారు ఎలాగైనా సరే ఆడగలుగుతారు. పరుగుల నుంచి మొదలు పెడితే వికెట్ల వరకు ప్రతి విషయంలోనూ సత్తా చూపిస్తారు.
ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు బలమైన ఆటగాళ్లతోనే రంగంలోకి దిగింది. ముఖ్యంగా బ్యాటర్ల విషయంలో మాత్రం ఆస్ట్రేలియా జట్టు మిగతా జట్లతో పోల్చి చూస్తే అత్యంత బలంగా కనిపిస్తోంది. అయితే అటువంటి ఆస్ట్రేలియా జట్టు జింబాబ్వే ఎదుట తలవంచడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. 23 పరుగుల తేడాతో దారుణమైన ఓటమిని ఎదుర్కొని.. పరువు తీసుకుంది.
జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయిన తర్వాత రకరకాల సమీకరణాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండి అభిమానులు కొత్త సూత్రీకరణను తెరపైకి తీసుకొచ్చారు. జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది కాబట్టి టీమిండి అనే టి20 వరల్డ్ కప్ సాధిస్తుందని అభిమానులు వాదిస్తున్నారు.
1983 వన్డే వరల్డ్ కప్, 2007 t20 వరల్డ్ కప్ లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించింది. అప్పుడు భారత్ విజేతగా నిలిచింది. ఇప్పుడు టి20 వరల్డ్ కప్ మ్యాచ్ లోనూ ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడంతో.. నాటి సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇదే గనుక రిపీట్ అయితే సూర్యకుమార్ యాదవ్ సేన ట్రోఫీ గెలవడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు.
Google ఇండియా కూడా టీమిండియానే విజేతగా నిలుస్తుందని అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి అనేక కారణాలను గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈసారి సొంత దేశంలో ఆడుతూ ఉండడం.. క్రితం సారి జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలవడంతో.. ఇవన్నీ కూడా టీమిండియా కు సానుకూల ఫలితాలను అందిస్తాయని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఒకవేళ ఇదే కనుక జరిగితే సూర్యకుమార్ యాదవ్ పేరు చరిత్రలో ఘనంగా నిలిచిపోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా విజేతగా నిలిచింది. సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను ఒత్తిడిలో పడేసి.. విజయం అందుకుంది. తద్వారా 2007 తర్వాత మళ్లీ 2024 లో టీమిండియా విజేతగా నిలిచింది. అయితే 2026లో కూడా విజేతగా నిలిచి రికార్డు సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.