Homeవింతలు-విశేషాలుLoan Recovery Incident: అప్పు చెల్లించలేదని ముక్కు నేలకు రాయించారు.. వైరల్ వీడియో

Loan Recovery Incident: అప్పు చెల్లించలేదని ముక్కు నేలకు రాయించారు.. వైరల్ వీడియో

Loan Recovery Incident: ఈ భూమ్మీద మనిషి మనుగడకు అత్యంత కీలకమైన సాధనం డబ్బు. ఆ డబ్బు ఉంటే ఈ లోకం జేజేలు పలుకుతుంది. సలాం కొడుతుంది. డబ్బు లేకపోతే దూరం పెడుతుంది. చివరికి చీత్కరిస్తుంది. డబ్బున్న వాళ్లకు మన సమాజంలో లభించే గౌరవం.. ప్రఖ్యాతి వేరే విధంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసం మనుషులు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. కొందరు న్యాయమైన పద్ధతుల్లో వెళితే.. మరికొందరు అన్యాయమైన విధానాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు ధర్పాన్ని ప్రదర్శిస్తే.. లేనివాళ్లు కష్టాలు అనుభవిస్తుంటారు.

డబ్బు కోసం రకరకాల మార్గాలను అన్వేషించే మనుషులు.. అవసరాలు తీర్చుకోవడానికి అప్పులు కూడా చేస్తుంటారు. వెనకటి కాలంలో తీసుకున్న అప్పులు చెల్లించడానికి మనుషులు రకరకాల పనులు చేసేవారు. వెనుకటి కాలంలో గ్రామాలలో కరణాలు.. షావుకారులు.. వ్యాపారులు వడ్డీలకు ఇచ్చేవారు. అప్పు వసూలు కింద చాకిరి చేయించుకునేవారు. కొన్ని సార్లు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన ధాన్యం, ఇతర ఉత్పత్తులను సైతం అప్పు కింద జమ చేసుకునేవారు. ఇప్పుడు కాలం మారింది. చాలామందికి ఆర్థిక స్థిరత్వం వచ్చింది. అప్పులు తీసుకునేవారు.. సక్రమంగానే చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం నేటికీ అనాగరిక పరిస్థితులే కొనసాగుతున్నాయి.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో నేటి కాలంలోనూ అప్పులు తీసుకున్న వారి పరిస్థితిని బయటపెడుతోంది. ఆ వీడియోలో కొంతమంది ముక్కు నేలకు రాస్తున్నారు. అలా రాయడం వెనక కారణం ఉంది. అప్పు తీసుకున్న వాళ్లు తిరిగి చెల్లించకపోవడంతో.. ఇచ్చినవాళ్లు ముక్కు పిండి మరి ముక్కు నేలకు రాయిస్తున్నారు. ఇలా రాస్తే 50% డిస్కౌంట్ కూడా ఇస్తామని ప్రకటిస్తున్నారు. వాస్తవానికి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించాలి. కొన్ని సందర్భాలలో తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే స్తోమత ఉండదు. అలాంటప్పుడు కొంచెం గడువిస్తే సరిపోతుంది. అలాకాకుండా రుణం తీసుకున్న వాళ్ళ మీద పైశాచికానికి పాల్పడితే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. అయితే ఇలా ముక్కు నేలకు రాసిన సంఘటన ఎక్కడ జరిగింది.. ఏ ప్రాంతంలో చోటుచేసుకుంది అనే వివరాలు మాత్రం బయటికి తెలియ రాలేదు. ఈ వీడియో మాత్రం నేటి ఆధునిక కాలంలో కూడా అనామక పరిస్థితులను బయటపెడుతోంది. ఎంతైనా డబ్బున్న వాడి పెత్తనం.. డబ్బు తీసుకున్న వాళ్ళ మీద దారుణంగానే ఉంటుంది. దానిని ఈ వీడియో మరింత బలంగా నిరూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular