Birds know about Tsunami: ప్రకృతి లో సమస్త జంతువులు ఉంటాయి. వీటిలో మనుషులు అత్యంత తెలివైన వారైనప్పటికీ.. మిగతా జంతువుల మాదిరిగా ప్రమాదాలను మరీ ముఖ్యంగా ప్రకృతి విపత్తులను గుర్తించలేరు. కాకపోతే మిగతా జంతువులు ప్రకృతి విపత్తులను గుర్తిస్తాయి. విపత్తులను గుర్తించి ప్రమాద సంకేతాలను ఇస్తుంటాయి. రష్యా లో చోటు చేసుకున్న సముద్ర అలజడిని పక్షులు ముందుగానే గుర్తించాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
రష్యాలోని తూర్పు తీరం ప్రాంతంలో భూకంపం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భూకంపం ధాటికి సముద్రంలో అలజడి నెలకొంది. ఈ హెచ్చరికలను పక్షులు ముందుగానే పసిగట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో న్యూ పోర్ట్ బీచ్ ప్రాంతంలో పక్షులు ఒకసారి ఎగిరిపోయాయి. పైగా అవి రకరకాల అరుపులు చేసుకుంటూ వెళ్ళిపోయాయి. వాస్తవానికి ఆ ప్రాంతంలో పక్షులు ఇంతవరకు ఆ స్థాయిలో ఎన్నడూ ఎగరలేదని స్థానికులు చెబుతున్నారు.
Read Also: వైఎస్సార్ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. ఒకేసారి 16 మంది..!
కాలిఫోర్నియా ప్రాంతంలో న్యూ పోర్ట్ బీచ్ లో పక్షులు ఎగరగానే స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ మరుసటి రోజు సముద్రంలో సునామీ ఏర్పడటం.. పుతిన్ పరిపాలిస్తున్న దేశంలో తూర్పు ప్రాంతంలో నష్టం చోటు చేసుకోవడం వంటివి జరిగిపోయాయి. కేవలం రష్యా మాత్రమే కాదు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న దేశాలు మొత్తం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇందులో అమెరికా కూడా ఉంది. కడలిలో చోటుచేసుకుంటున్న మార్పులను గుర్తించి అధికారులు ముందుగానే హెచ్చరికలను జారీ చేశారు. అయితే వాటికంటే ముందే పక్షులు సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులను గుర్తించి.. అవి హెచ్చరికలు జారీ చేశాయి. ఆ తర్వాత రష్యా తూర్పు ప్రాంతంలో సునామీ ఏర్పడటం సంచలనం కలిగిస్తోంది.. పక్షులు ఎగిరిపోయిన వీడియోను చూసిన నెటిజన్లు ” నేచర్ లో ఏం జరుగుతుందో పక్షులకు తెలుస్తుంది. సముద్రంలో చోటు చేసుకున్న మార్పులను అవి గమనించాయి. ఇలాంటి వాటిని చెప్పడానికి సైరన్లు అవసరం లేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Read Also: నాన్ వెజ్ అంటే మనకే కాదు..యావత్ ప్రపంచానికి ఇష్టమే..ఇంతకీ వేటిని ఎక్కువ తింటున్నారో తెలుసా?
ప్రతీపశక్తులు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరిగే ముందు కుక్కలు పసిగడతాయి. దానిని ప్రపంచానికి చెప్పడానికి అరుపులు అరుస్తుంటాయి. అలాగే పక్షులు కూడా రకరకాల సంకేతాలు ఇస్తూ ఉంటాయి.. సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు పక్షులు గుర్తిస్తాయని.. అందువల్లే సునామీ హెచ్చరికలను పక్షులు ఈ విధంగా ప్రయత్నం చేశాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. పక్షులకు అత్యంత సూక్ష్మమైన శబ్దాలను వినే సామర్థ్యం ఉంటుందని.. సముద్ర జలాల్లో ఆకస్మిక కదలికలను పక్షులు పసిగట్టాయని.. అవి అవాంఛనీయంగా ఉండడంతోనే అలా లేచిపోయాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.