Engine power measured in horsepower: మోటార్ల ఇంజిన్ సామర్థ్యాన్ని హార్స్ పవర్స్‌లో కొలుస్తాం. చదువుకున్నవారు.. చదువు రానివారు.. మోటార్లను కొనేటప్పుడు మోటార్ ఎంత హెచ్‌పీ(హార్స్ పవర్) అని అడుగుతారు. హెచ్‌పీ అనేది మోటార్ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ప్రపంచమంతటా∙ఇలా హెచ్‌పీలలో సామర్థ్యాన్ని కొలుస్థారు. కానీ, హెచ్‌పీలలోనే ఎందుకు కొలుస్తున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
హెచ్‌పీ ప్రమాణం ఎలా వచ్చింది?
హార్స్ పవర్(హెచ్‌పీ) ఎలా వచ్చిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. అందరం ఇంజిన్లు కొనేటప్పుడు సామర్థం ఎంత హెచ్‌పీ అని మాత్రమే అడుగుతాం. కానీ, అది ఎలా వచ్చింది. అనేది ఆలోచించం… కానీ దీని వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. జేమ్స్ వాట్.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు.. మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ తయారు చేసింది ఈయనే. మొదట ఆయన ఒక ఇంజిన్ తయారు చేశారు. దానిని అమ్మేందుకు ఒకరోజు మార్కెట్‌కు తీసుకెళ్లారు. అయితే దానిని కొనేందుకు వచ్చినవారు దాని పనితీరు.. సామరథ్యం గురించి అడిగారు. పనితీరు చెప్పిన జేమ్స్ వాట్.. సామర్థ్యం ఎలా తెలియక తికమక పడ్డారు. సైంటిస్టు అయిన వాట్‌కు ఇదే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. అప్పట్లో బరువులను లాగడానికి.. భూగర్భ గనుల నుంచి మంటి, బొగ్గు, ఐరన్, బంగారం వెలికి తీయడానికి గుర్రాలను ఉపయోగించేవారు. అంటే మనం ఎద్దులు, దున్నలతో వ్యవసాయం చేసినట్లు అన్నమాట. గుర్రాల ఆలోచన మదిలో మెదిలిన వాట్.. ఇంజిన్ సామర్థ్యం రెండు హార్స్ పవర్స్ అని వెల్లడించారు. ఈమేరకు అక్కడే టెస్టు కూడా చేసి చూశారు. రెండు గుర్రాలు లాగే బరువును ఈ ఇంజిన్ లాగింది. దీంతో ఇంజిన్ పవర్‌ను 2 హార్స్ పవర్‌గా పేర్కొన్నాడు.
అప్పటి నుంచే హెచ్‌పీ..
ఇలా జేమ్స్ వాట్.. పేర్కొన్న ఈ హెచ్‌పీ.. అప్పటి నుంచే ప్రమాణికంగా.. ప్రమాణంగా మారింది. ఆ తర్వాత ఏ ఇంజిన్ తయారు చేసినా దాని సామర్థ్యాన్ని ఇలా హార్స్ పవర్స్‌లోనే కొలవడం ప్రారంభించారు. ఇప్పటికీ సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా హార్స్ పవర్ ప్రమాణం మాత్రం మారలేదు!