Homeవింతలు-విశేషాలుBirds 5000 km journey in 5 days: సాధారణ పక్షులు.. ఐదు రోజుల్లో.. 5000...

Birds 5000 km journey in 5 days: సాధారణ పక్షులు.. ఐదు రోజుల్లో.. 5000 కిలోమీటర్ల ప్రయాణం.. దీని వెనుక పెద్ద కథ

Birds 5000 km journey in 5 days: మనుషులకు కుక్కలను అత్యంత విశ్వాస పాత్రమైన జంతువులు అని పిలుస్తుంటారు. ఎందుకంటే మనుషులకు, కుక్కలకు వందల సంవత్సరాల క్రితం నుంచి బలమైన అనుబంధం ఉంది. పైగా మనుషులు కుక్కలను విపరీతంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఆహారం నుంచి మొదలు పెడితే సంరక్షణ వరకు అన్ని విభాగాలలో అద్భుతంగా చూసుకుంటారు. అందుకే మనుషులను కుక్కలు విపరీతంగా ఇష్టపడుతుంటాయి. తమకు ఆశ్రయం కల్పించిన యజమానికి అండగా ఉంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడవు.

కుక్కలు మాత్రమే కాదు మనుషులకు పక్షులు కూడా అత్యంత ఆత్మీయ నేస్తాలు. పురాణ కథలలో పక్షులు యుద్ధాలలో సహకారం అందించాయని.. ప్రత్యర్థులను మట్టు పెట్టడంలో ఉపకరించాయని మనం చదువుకున్నాం. అందులో నూటికి నూరు శాతం నిజం ఉంది. ఎందుకంటే పక్షులు నమ్మకమైన నేస్తాలు. కాసిన్ని గింజలు.. కూసింత రక్షణ కల్పిస్తే అవి మనతోనే ఉంటాయి. మన వెంటే ఉంటాయి. అవసరమైతే చెప్పిన పనిని రెక్కలు ఆడించుకుంటూ చేస్తాయి. కాకపోతే వాటికి కొంతమేర శిక్షణ ఇవ్వాలి.

ఆధునిక కాలంలో యుద్ధాలు మిస్సైల్స్ ద్వారా.. రాకెట్ల ద్వారా.. డ్రోన్ల ద్వారా జరుగుతున్నాయి. వీటన్నిటికీ విపరీతమైన ఖర్చు. కానీ పక్షులను నమ్ముకుంటే ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. ప్రత్యర్థి దేశాల మీదకు జస్ట్ పక్షులను పంపిస్తే చాలు. అవి ఆయా దేశాల గుట్టుమట్లను తెలుసుకుంటాయి. రహస్యలను తెలియజేస్తాయి. అందుకే కొంతకాలంగా మన సైన్యం ఫాల్కన్ (డేగ) లకు శిక్షణ ఇస్తోంది. కాకపోతే ఈ విషయాన్ని దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని బయట పెట్టడం లేదు. ఫాల్కన్లు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. వీటి రెక్కలు మందంగా ఉంటాయి. శరీర బరువు 160 నుంచి 200 గ్రాముల వరకే ఉంటుంది. అయితే ఫాల్కన్ రకాలలో తేలికగా ఉండే వాటిని మాత్రమే భద్రత పరమైన వాటికోసం ఉపయోగిస్తుంటారు.

ఇటీవల కాలంలో అమూర్ జాతక చెందిన వలస పక్షులపై వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రయోగాలు చేసింది. ఆమూర్ అనే డేగలు మణిపూర్ ప్రాంతం నుంచి దక్షిణాఫ్రికాకు కేవలం ఐదు రోజుల్లోనే చేరుకున్నాయి. ఐదువేల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాయి. ప్రతిరోజు వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించగలిగాయి. ఈ పక్షులను వదిలిన అధికారులు.. శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా వాటి వేగాన్ని పరిశీలించారు. అరేబియా సముద్రాన్ని అత్యంత సులువుగా దాటిన ఈ పక్షులు.. అత్యంత క్షేమంగా దక్షిణాఫ్రికా చేరుకున్నాయి. ఈ పక్షులకు అప సాంగ్, అలాంగ్, అహు అని పేర్లు పెట్టారు.. దేశ అంతర్గత భద్రత పర్యవేక్షణలో వీటిని ఉపయోగిస్తారని తెలుస్తోంది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular