Homeక్రీడలుక్రికెట్‌Chris Woakes Injury Fifth Test: కీలక బౌలర్ కు గాయం.. ఇంగ్లాండ్ కు ఇది...

Chris Woakes Injury Fifth Test: కీలక బౌలర్ కు గాయం.. ఇంగ్లాండ్ కు ఇది మామూలు షాక్ కాదు..

Chris Woakes Injury Fifth Test: ఐదో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆరు వికెట్లను త్వర త్వరగానే తీసింది. టీమిండియాలో కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ చేసి జట్టును ఆదుకున్నాడు. తద్వారా భారత్ 204 పరుగులు చేసింది. రెండవ రోజు వాషింగ్టన్ సుందర్, నాయర్ నెలకొల్పే భాగస్వామ్యం ఆధారంగానే టీమ్ ఇండియా స్కోర్ ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆతిథ్య జట్టుకు తొలి రోజు షాక్ తగిలింది. ఇంగ్లాండ్ జట్టులో కీలకంగా ఉన్న వోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ ని ఆపే క్రమంలో అతడు గాయపడ్డాడు.

బంతిని ఆపే సమయంలో అతడు ఒక్కసారిగా కిందపడ్డాడు. ఇదే సమయంలో అతడి భుజం గ్రౌండ్ కు బలంగా తగిలింది. దీంతో నొప్పితో అతడు విలవిలలాడిపోయాడు. వెంటనే ఫీల్డ్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అతడి స్థానంలో మరో ఆటగాడు వచ్చి ఫీల్డింగ్ చేశాడు. వోక్స్ అద్భుతమైన బౌలర్. ఐదో టెస్టులో అతడు అత్యంత కీలకమైన కే.ఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు.. 13 ఓవర్లు వేసిన అతడు 46 పరుగులు ఇచ్చాడు..

Read Also: తెలుగు రాష్ట్రాల్లోని వారికి శుభవార్త.. వరుసగా 3 రోజులు సెలవులు..

వోక్స్ గాయంపై ఇంగ్లాండ్ జట్టు బౌలర్ అట్కిన్సన్ స్పందించాడు..” గాయానికి సంబంధించి ఇంతవరకు స్పష్టత రాలేదు. అతని భుజం వాచింది. గాయం తీవ్రత అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది. చూడబోతే అతడు అయిదవ టెస్ట్ లో రెండవ రోజు ఆడేది అనుమానం గానే ఉంది. అతడి ఆటకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ పరిస్థితి మెరుగుపడక పోతే అతడు ఆట కొనసాగించడం కష్టమేనని” అట్కిన్సన్ పేర్కొన్నాడు.

Read Also: బాలీవుడ్ సౌత్ దర్శకుల వెంట ఎందుకు పడుతోంది..?

వోక్స్ కనుక బౌలింగ్ చేయలేకపోతే అది ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద నష్టమే. అట్కిన్సన్, టంగ్ చెరి 2 వికెట్లు పడగొట్టారు. వీరిద్దరి కంటే కూడా వోక్స్ మెరుగైన బౌలర్ గా పేరుగాంచాడు. జట్టుకు వికెట్ అవసరమైన ప్రతి సందర్భంలో ఇతడు అద్భుతంగా బౌలింగ్ చేసి బ్రేక్ ఇచ్చేస్తుంటాడు. గడచిన నాలుగు టెస్టుల్లో ఇదే జరిగింది. ఇప్పుడు ఐదో టెస్టులో అతడు గాయపడిన నేపథ్యంలో.. అది ఇంగ్లాండ్ జట్టుకు ఇబ్బందికరమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..అట్కిన్సన్ గొప్పగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. రెండవ రోజు అతడు అదే జోరు కొనసాగిస్తాడా అనేది అనుమానమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే అతడిని వాషింగ్టన్ సుందర్, నాయర్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారు..

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular