Best Adventure Travel Spots in India: రోజంతా పని ఒత్తిడి కారణంగా మానసికంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు చాలామంది. విద్యార్థులు చదువుతో.. ఉద్యోగులు కార్యాలయాల్లో.. గృహిణులు ఇంట్లో పనులతో బిజీగా ఉంటూ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఇలాంటివారు వారంలో ఒకసారి విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం విహారయాత్రలకు వెళ్లడం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూర్ ఉండాలని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి వారి కోసం అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో.. తెలుసుకోవాలని ఉంటుంది. వారికోసం ఈ స్టోరీ.
Also Read: ప్రతి ఒక్కరిలో ఈ 15 ఏళ్ల జీవితం చాలా ఇంపార్టెంట్.. ఎప్పుడంటే?
విహారయాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ట్రెక్కింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. మనదేశంలో ట్రెక్కింగ్ కు ఉత్తరాఖండ్ రాష్ట్రం అనువుగా ఉంటుంది. ఈ రాష్ట్రంలోని కేదార్ కంథ, రూపుకుండ్ వంటివి ప్రసిద్ధమైనవి. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని Hamantapass కు కూడా వెళ్లొచ్చు. ఇక్కడికి వెళ్లడానికి ఢిల్లీ లేదా డెహ్రాడూన్ కు వెళ్లి అక్కడ నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు. తమిళనాడు లోని కొడైకెనాల్ లోని ధోలార్ పీక్ ట్రెక్ వంటి వాటికి కూడా వెళ్లొచ్చు.
సముద్రంలో దూకి ఈదాలనుకునేవారు చాలా మందే అనుకుంటారు. దీనినే స్కూబా డైవింగ్ అంటారు. స్కూబా డైవింగ్ చేయాలని అనుకునేవారు అండమాన్ అండ్ నికోబార్ లోని హవ్ లాక్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ఎలిఫెంట్ బీచ్, నీల్ ఐలాండ్ కూడా అనుగుణంగా ఉంటుంది. ఫోర్ట్ బ్లెయిర్ నుంచి ఫెర్రీ ద్వారా హవ్ లాక్ చేరుకోవచ్చు. గోవాలోని గ్రాండె ఐలాండ్, మోర్భగావ్ ఏరియా కూడా స్కూబా డైవింగ్ కు అనుగుణంగా ఉంటుంది. ఇక్కడికి గోవా ఎయిర్ పోర్టు నుంచి వెళ్లొచ్చు.
Also Read: డిస్కవరీ, ఎనిమల్ ప్లానెట్ లో చూపించేది నిజం కాదా.. దాని వెనుక ఇంత కథ ఉందా?
పచ్చని అడవిలో జంతువులను దగ్గరి నుంచి చూడాలని కోరుకునేవారు ఉంటారు. ఇలాంటి వారు ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ సఫారీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ లోని రణతం బోర్, అసోంలోని కాజీరంగా సఫారీలో ప్రసిద్ధి చెందినవి. ఇక్కడకి రైల్వే ద్వారా కూడా వెళ్లొచ్చు.
హాట్ ఎయిర్ బెలూన్ మన దేశంలో కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. రాజస్థాన్ లోని జైపూర్, మహారాష్ట్రలోని లోనావాల, కర్ణాటకలోని హంపీలో హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా ప్రకృతిలో విహారించవచ్చు.
రాక్ క్లౌంబింగ్ చాలా ప్రమాదకరమైనది. అయినా ఇది చేయాలని చాలా మంది అనుకుంటారు. ఇలాంటివాటికి అనుగుణంగా కర్ణాటకలోని హంపి, బదామీ ప్రదేశాలు ప్రసిద్ధిగాంచినవి.
సాధారణ విహారయాత్రలకంటే ఇలాంటి అడ్వెంచర్ టూర్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అయితే ఈ సాహసయాత్ర చేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.