Bacha Bazi in Afghanistan: సృష్టిలో కొన్ని పద్ధతులు ఉంటాయి. మనిషి ఎంత గొప్పగా అభివృద్ధి చెందినప్పటికీ ఆ పద్ధతులను అధిగమించలేడు. ఆ పద్ధతులకు ప్రత్యామ్నాయం కనిపెట్టలేడు. కానీ రాను రాను రాజు గుర్రం గాడిది అయినట్టు.. అభివృద్ధి చెందుతున్న మనిషి కాలానుగుణంగా పెడపోకడలు పోతున్నాడు. సృష్టికి విరుద్ధంగా పయనిస్తూ పరువు తీసుకుంటున్నాడు. వాస్తవానికి సృష్టి ధర్మాన్ని కాల రాయడం అంటే వినాశనాన్ని వెతుక్కునట్టే లెక్క. ఈ ప్రకారం చూసుకుంటే మనుషులు దానికి దగ్గరలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ చర్చకు కారణమవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
ఆసియా ఖండంలో ఆఫ్ఘనిస్తాన్ అనే దేశం ఉంది. ఈ దేశానికి మనకు సరిహద్దు కూడా ఉంది. గతంలో ఈ ప్రాంతంలో అమెరికా దళాలు ఉండేవి. అప్పట్లో తాలిబన్లు రహస్య జీవితం గడిపేవారు. కానీ ఎప్పుడైతే ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయాయో.. అప్పుడు తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాలిబన్లు హింసాయుత ప్రవృత్తిని కలిగి ఉంటారు. ఆడవాళ్ళ మీద తమ పైశాచికాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కనీసం వారిని బయటికి రావడానికి కూడా ఒప్పుకోరు. అక్కడ బహుభార్యత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే అలాంటి చోట సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. దానికి వారు పెట్టిన పేరు “బచా బాజీ”.. ఇందులో భాగంగా అబ్బాయిలు స్త్రీలుగా వేషధారణ వేసుకుంటారు. యుక్త వయసులో ఉన్న అబ్బాయిలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. స్త్రీలుగా వేషధారణ వేసుకున్న వారు నృత్యాలు చేస్తూ రెచ్చగొట్టే చూపులతో కైపు కలిగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో వారితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు.
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఆడవాళ్లపై నిషేధం దారుణంగా కొనసాగుతోంది. ఈ తరహా నృత్యాలు గతంలో అమ్మాయిలు చేసేవారు. కాకపోతే అవి సాంప్రదాయ బద్దంగా ఉండేవి. అవి కేవలం సాంస్కృతికపరమైన ఉత్సాహాన్ని కలిగించేవి. కానీ అమ్మాయిల ప్లేస్ లో ఇప్పుడు అబ్బాయిలు వచ్చారు. అమ్మాయిల మాదిరిగా వస్త్రధారణ ధరించి ఇలా రెచ్చగొట్టే డ్యాన్సులు వేస్తున్నారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కలికాలం అంతానికి వచ్చిందని.. ఇదంతా కూడా వినాశకానికి దారితీస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవల కాలంలో ఈ తరహా పోకడలు పెరిగిపోయాయి. రాత్రిపూట బాజీ వేడుకలు ఎక్కువైపోయాయి.
In Afghanistan, the segregation of women is so extreme that they had to invent bacha bazi, a practice where boys dressed as women dance for powerful men, under the belief that sexual contact with young males is more moral.
— Dr. Maalouf (@realMaalouf) September 19, 2025