Asteroid YR4
Asteroid YR4: ఇప్పుడు భూమికి ఒక గ్రహ శకలం దూసుకు వస్తోంది. దాని పేరు ఆస్టరాయిడ్ – 2024 YR4.. ఇది భూమి వైపు దూసుకు వస్తోంది. ఇది ఎలా ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? అనే విషయాలపై శాస్త్రవేత్తలకు ఒక అవగాహన లేదు. కాకపోతే గతంలోనే ఇది భూమి వైపుకు దూసుకు వస్తోందని నాసా వెల్లడించింది. భూమిని ఢీకొట్టడానికి 2.6% అవకాశం ఉందని అప్పట్లో నాసా వెల్లడించింది. అయితే ఇప్పుడు అది 2.6% నుంచి 3.1 శాతానికి పెరిగిందని నాసా చెబుతోంది. ఈ ఆస్టరాయిడ్ 8 మెగా టన్నుల శక్తిని విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇది హిరోషిమా పై అమెరికా వేసిన అణుబాంబు కంటే 500 రెట్లు అధికం. ముంబై, కోల్ కతా, ఢాకా లాంటి నగరాలు తుడిచి పెట్టుకుపోయేంత ప్రభావం దీనికి ఉంటుంది. ఇది చేసే విధ్వంసం వల్ల నష్టం అపారంగా ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒకవేళ భూమిని ఢీకొడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో ఓ వీడియో రూపంలో కూడా చూపించారు. అది ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఎలా ఏర్పడుతుందంటే..
అంతరిక్షంలో దుమ్ము ధూళి, ప్రత్యేక పరిస్థితులు గ్రహ శకలాలు ఏర్పడేందుకు కారణమవుతాయి. అయితే ఇవి ఏర్పడేందుకు చాలా సంవత్సరాలు పడుతుంది. కొన్ని గ్రహశకలాలు ఏర్పడిన కొద్దిరోజుల్లోనే పేలిపోతాయి. మరికొన్ని అయితే తమ పరిమాణాన్ని అంతకంతకు పెంచుకుంటాయి. వేగం తీరును, దూసుకొచ్చే తీరును మార్చుకుంటాయి. ప్రస్తుతం భూమి పైకి వస్తున్న ఆస్టరాయిడ్ 2024 YR4 54 మీటర్ల పరిమాణంలో ఉంది.. గతంలో ఇది భూమిని ఢీకొట్టే అవకాశం 2.6 శాతం వరకే ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా 3.1 శాతానికి పెరిగింది. అంటే ఇది భూమిని ఢీకొట్టే శాతం ఎంతవరకు పెరుగుతుందనేది అంచనా వేయలేమని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు..” ఆ గ్రహశకలం భూమి వైపుగా దూసుకు వస్తుందని మా అధ్యయనాలలో తేలింది. గతంలో అది భూమిని ఢీకొట్టే అవకాశం 2.6% వరకే ఉండేది. ఇప్పుడు అది 3.1 శాతం పెరిగింది. అది మరింత పెరుగుతుందా? లేదా తగ్గుతుందా? అనే విషయాలపై అంచనా లేదు.. ఒకవేళ గ్రహశకలం మధ్యలో పేలిపోతే భూమికి పెద్దగా ప్రమాదం ఉండదు.. కాకపోతే దాని గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని” నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ గ్రహశకలం భూమిని కనుక ఢీకొడితే ఎలా ఉంటుందని దానిపై రూపొందించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది..
భూమిపైకి ఆస్టరాయిడ్ 2024 YR4 దూసుకు వస్తున్నది. ఇది ఎనిమిది మెగా టన్నుల శక్తిని విడుదల చేస్తుంది. దాని శక్తి హీరోషిమాపై అమెరికా వేసిన అణు బాంబు కంటే 500 రెట్లు అధికం.#asteroid2024YR4#Earth2#NASA#Space pic.twitter.com/SKPoslAy1p
— Anabothula Bhaskar (@AnabothulaB) February 19, 2025