Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి రోజు లక్షలాది వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో వందల సంఖ్యలో వీడియోలు మాత్రం చాలా వైరల్ అవుతుంటాయి. వీటిని చూసిన తర్వాత ఔరా అని ఆశ్చర్యపోక తప్పదు. మనలో చాలా మంది పైకి సాధారణంగా కనిపించినప్పటికీ వారిలో అసాధారణమైన ప్రతిభను కలిగి ఉంటారు. ఇలాంటి వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది సోషల్ మీడియా.. తమలో దాగి ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఓ వేదికలా సోషల్ మీడియా మారిపోయింది. ఇందులో సాధారణమైన వ్యక్తులు కూడా అసాధారణమైన ప్రతిభను కనబరుస్తుంటారు. రెగ్యులర్‌గా ప్రతి ఒక్కరూ చేసే పనినే తమదైన శైలిలో వినూత్నంగా చేసేందుకు ప్రయత్నించి క్లిక్ అవుతున్నారు. ముఖ్యంగా రోజూ ఒకే పనిని చేసే వ్యక్తి ఆ పనిలో మాస్టర్ అయిపోతాడన్న సంగతి తెలిసిందే. అతడి అనుభవంతో నిపుణుడిగా మారిపోతాడు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మనం ఏ పని చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఎంత పర్ఫెక్షన్‌తో చేస్తున్నాం అన్నదే ముఖ్యమని చెబుతుంటారు. ఇలా తన పనిలో ఎక్సలెన్స్ సాధిస్తూ తనకు తిరుగు లేదని పించుకుంటున్నాడో యువకుడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే ఔరా అనాల్సిందే. ఆ వీడియోలోని కుర్రాడు ఉల్లిపాయలను కోయడంలో మామూలు వేగాన్ని ప్రదర్శించడం లేదు. ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వేగంగా ఉల్లిపాయలను కట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఓ కుర్రాడు. ఏంటి.. ఉల్లిపాయలను కట్ చేయడం కూడా గొప్పేనా అనుకుంటున్నారా.. అయితే ఈ కుర్రాడు ఉల్లిపాయను కట్ చేస్తున్న స్పీడ్ చూస్తుంటే మీరు కూడా వావ్ అనాల్సిందే. కనీసం ఉల్లిపాయ వైపు కన్నెత్తి కూడా చూడనే చూడకుండా అతి వేగంగా చాకుతో ఉల్లిపాయను టకటకా కట్ చేస్తున్నాడు. just_crazy_thingss అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు ఉల్లిపాయలను చాలా స్పీడ్ గా కట్ చేస్తున్నాడు. ఉల్లిపాయ వైపు చూడకుండా చేతిని అతి వేగంగా కదిలిస్తూ సెకెన్ల వ్యవధిలో ఉల్లిపాయలను అతి చిన్న ముక్కలుగా కోసేస్తున్నాడు. అతడి ప్రతిభను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలోని కుర్రాడి ప్రతిభను చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేశారు. వీడెవడో మిక్సీ కంటే ఫాస్ట్ గా కట్ చేస్తున్నాడు.. వీడు మనిషి రూపంలో ఉన్న మెషిన్.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.