Prashanth Neel and NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ (NTR) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. గత సంవత్సరం ‘దేవర ‘ (Devara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో 500 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టాడు. ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఆ సినిమా భారీ సక్సెస్ ని సాధించలేకపోయింది. దాంతో ఎలాగైనా సరే భారీ కాంబినేషన్ లో ఈ సినిమాను సెట్ చేయాలని చూసిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ప్రశాంత్ నీల్ మరోసారి తన స్టార్ డమ్ ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూట్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్ అయితే వేశారు. మరి ఈ సెట్ లో 2500 మంది జూనియర్ ఆర్టిస్టులతో సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వబోతుందట.
ఇక మొదటి షెడ్యూల్ లోనే భారీగా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ షెడ్యూల్లో ఒక భారీ సీక్వెస్ ను తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లో నిలుస్తుందని తన అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్, సలార్ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఆయన మీద ప్రతి ఒక్కరికి మంచి నమ్మకం అయితే ఉంది.
మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రశాంత్ ఎన్టీయార్ కి భారీ విజయాన్ని కట్టబెడతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా మహారాష్ట్ర బ్యాక్ డ్రాప్ లు తెరకెక్కబోతుందట. మహారాష్ట్ర పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని దర్శకుడు క్లారిటీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం.
ఎందుకంటే తన తోటి హీరోలు 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుంటే తను మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ అనేది భారీ రేంజ్ లో పెరగడమే కాకుండా అయాన క్రేజ్ ను కూడా పెంచుతుంది…